తూర్పు గోదావరి:పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తూర్పు గోదావరి:

పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్..

- ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఒక వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మించాలి అని అమరావతి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది.

- దీనితో బాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతా ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పని చేసింది

- ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించి అభివృద్ధిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సముచితం స్ధానం కల్పించి అక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది.

- హూద్ హూద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నం ను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆర్ధిక రాజధానిగా చంద్రబాబు మలచడం జరిగింది..

- వైసిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం మూడు నెలలు కావస్తున్నా..... ఎక్కడ అభివృద్ధి నోచుకోలేదు..... ఒక్క పైసా అభివృద్ధి పై ఖర్చు చేయలేదు...

- ముఖ్యమంత్రి కేవలం రాజధాని మార్పుపైని దృష్టి సారించారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజావసరాలను విస్మరించారు.

- ఈ రోజు కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న... వైరస్ నిరోధించే చర్యలు చేపట్టడంలో ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కావలసిన సామాగ్రి ఏర్పాటు విషయంలోనూ.... క్వారెంటైన్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన వియంలోను ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని....

- ఈ చర్యలతో ప్రజారోగ్యంతో పాటు.... రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడుతుంది.

Update: 2020-08-08 12:05 GMT

Linked news