TS High Court :-ఆన్ లైన్ తరగతులు నిషేధించాలన్న... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
TS High Court :-
ఆన్ లైన్ తరగతులు నిషేధించాలన్న హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పిల్ పై హైకోర్టులో విచారణ
ఆన్ లైన్, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిన్న కేబినెట్ నిర్ణయించిందన్న ప్రభుత్వం
ఒకటి, రెండు రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ప్రకటించినున్నట్టు తెలిపిన ప్రభుత్వం
మార్చిలోనే విద్యా సంవత్సరం మొదలు పెట్టినట్టు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠాశాలలు చెబుతున్నాయి; హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాలలకే వర్తిస్తుందా: హైకోర్టు
కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయన్న హైకోర్టు
ఐదో తరగతి లోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్ లైన్ లో ఎలా ఉండగలరు?: హైకోర్టు
పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుందన్న హైకోర్టు
ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన విధివిధానాలు కూడా ప్రకటిస్తాంమన్న ప్రభుత్వం
ఫీజులు వసూలు చేయ వద్దన్న జీవోను పాఠాశాలులు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్
ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని.. విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామన్న హైకోర్టు
ఆన్ లైన్ తరగతులకు వైఖరి వెల్లడించేందుకు మరికొంత సమయం కోరిన సీబీఎస్ఈ
విచారణ ఈనెల 27కి వాయిదా వేసిన హైకోర్టు