టీఎస్ హైకోర్టు....బక్రీద్ సందర్భంగా జంతు వధ... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

టీఎస్ హైకోర్టు....

బక్రీద్ సందర్భంగా జంతు వధ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు ఆదేశం

అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలన్న డాక్టర్ శశికళ పిల్ పై హైకోర్టులో విచారణ

హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం

అక్రమ జంతు వధపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం

జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలన్న హైకోర్టు

జంతు మాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్న హైకోర్టు

చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారం ఉందన్న హైకోర్టు

మాంసం దుకాణాలను జీహెచ్ ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేశారా అని ప్రశ్నించిన హైకోర్టు

రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Update: 2020-07-30 08:48 GMT

Linked news