ఎంపి రఘురామకృష్ణం రాజుప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఎంపి రఘురామకృష్ణం రాజు
ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం స్కూల్స్ తీసుకు రావడాన్ని అన్నప్పుడు మీరెందుకు వ్యతిరేకించారు అని నాకు షోకాజు నోటీసు ఇచ్చారు
ప్రాథమిక విద్యను మాతృభాషలో జరపాలని కేంద్రం తెచ్చిన జాతీయ విద్యావిధానం సూచించింది. దీన్ని ఏపి సీఎం గమనించాలి
జపాన్ , చైనా, దక్షిణ కొరియాలలో మాతృభాషలోనే విద్యాభ్యాసం జరుగుతుంది.
మాతృభాష వల్లనే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుంది. ప్రపంచమంతా ఒక దారిలో వెళితే 151 సీట్లు గెలిచిన సీఎం మరో దారిలో వెళుతున్నారు.
ఈ విద్యాసంవత్సరం నుండి మాతృభాషలోనే విద్యావిధానం కొనసాగించాలి. సీఎం కు నేరుగా చెప్పే అవకాశం లేదు కాబట్టే మీడియా ముఖంగా ఆ విషయాలను ప్రస్తావిస్తున్నాను.
నాతోపాటు చాలా మందికి సీఎం కలిసే అవకాశం ఇవ్వరు. పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయనప్పుడు నన్ను సమావేశాలకు ఎందుకు పిలవరు?
ప్రశ్నకు, ప్రశ్న సమాధానం కాదని సీఎం గుర్తుంచుకోవాలి. ఇంగ్లీషు మీడియం ను ప్రశ్నిస్తే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని సీఎం ప్రశ్నిస్తున్నారు.