Botcha Satyanarayana Comments: వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ..
బొత్స కామెంట్స్..
- పరీక్షల నిర్వహణలో 77,558 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
- పరీక్షా కేంద్రాలకు ఆర్టీసి నుంచి బస్సులను నడపాలి
- ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కూడా అందుబాటులో వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ 19 నిబంధనల ప్రకారం భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలి.
- పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద ధర్మల్ స్కానర్ తప్పనిసరి
- జిల్లా కలెక్టర్లు, జెసిలు, ఎస్పీలు పరీక్షలు సజావుగా జరిగేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలి
- గత ఏడాది ఏ రకంగా పకడ్భందీగా పరీక్షలు నిర్వహించారో, అదే విధంగా ఎటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా పరీక్షలు జరగాలి.
Update: 2020-09-16 08:10 GMT