Annavaram updates: ప్రైవేటు వెబ్‌సైట్‌లో దేవస్థానం వివరాలు పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవస్థానం అధికారులు..

తూర్పుగోదావరి..

-ఓ ప్రైవేటు వెబ్‌సైట్‌లో అన్నవరం దేవస్థానం వివరాలు పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అన్నవరం దేవస్థానం అధికారులు

-భక్తులను అయోమయానికి గురి చేసే విధంగా ధరలతో పాటు ప్రైవేటు ఫోన్‌ నంబరు పెట్టడంపై అభ్యంతరం తెలిపిన అధికారులు

-గో తిరుపతి.కామ్‌ వెబ్‌సైట్‌లో పలు దేవస్థానాల వివరాలతో పాటు అన్నవరం దేవస్థానం వివరాలు కూడా ఉన్నాయని అధికారులు గుర్తింపు

-అందులో అన్నవరం మ్యారేజీ ప్యాకేజీ, అన్నవరం దేవస్థానం మ్యారేజీ హాల్స్‌ కాలమ్స్‌లో చిత్రాలతో పాటు వాటి ధరలు కూడా పెట్టారని పేర్కొన్న   అధికారులు 

-వివరాల కోసం సంప్రదించాలని ప్రైవేటు ఫోన్‌ నంబరు కూడా పెట్టడంతో అప్రమత్తమైన అధికారులు

-దీనివల్ల భక్తులు అయోమయానికి గురవ్వడంతో పాటు, మోసపోయే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్న దేవస్థానం అధికారులు.

-ఈ నేపథ్యంలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఈవో వి.త్రినాథరావు

-అదేవిధంగా శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి భక్తి ఛానల్‌కు సిబ్బంది కావాలని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచార పత్రంలో స్వామివారి లోగో వాడారన్న దానిపై కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు

Update: 2020-10-20 08:52 GMT

Linked news