Amaravati updates: సీఎం వైయస్ జగన్ స్పందన కార్యక్రమం..
అమరావతి..
-జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ స్పందన కార్యక్రమం.
-క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం
-పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు.
-7 ప్రధాన అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం.
-వర్షాలు, కోవిడ్, ఎన్‌ఆర్‌ఈజిఎస్, నాడునేడు, విలేజీ, వార్డు సెక్రటేరియట్స్ తనిఖీలు తదితర అంశాలు
-వర్షాలకు సంబంధించి కలెక్టర్లుతో ప్రత్యేకంగా ఈ నెల 14న సమీక్ష నిర్వహించాం.
-కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో.. .వారికి వెంటనే సాయం చేయండి
-కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లందరూ31 అక్టోబరులోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేయండి.
-వెంటనే రోడ్ల మరమ్మత్తులు మొదలుపెట్టండి ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రోడ్లపై ధ్యాస పెట్టండి.
-కరెంటు పునరుద్ధరణ కలెక్టర్లు వేగంగా చేశారు. కలెక్టర్లందరికీ అభినందనలు.
-కలెక్టర్లకు, జేసీలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం.
-ఈనెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.