Amaravati updates: కరోనా విధుల్లో ఉన్న వైద్యులకు... నర్సులకు... ఆరోగ్యకార్యకర్తలకు జీతాలు ఇవ్వకపోతే ఎలా?నాదెండ్ల మనోహర్....

అమరావతి..

*నాదెండ్ల మనోహర్..ఛైర్మన్ రాజకీయ వ్యవహారాల కమిటీ*

-రెండు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫ్యలమే....

-తక్షణమే వైద్యారోగ్య సిబ్బందికి బకాయిలతోపాటు... ఒక నెల జీతం అడ్వాన్స్ గా ఇవ్వాలి...

-కోవిడ్-19 విధుల కోసం నియమించుకున్న మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులతోపాటు ఇతర సిబ్బందికి గత రెండు నెలలకు జీతాలు     చెల్లించడం లేదు.

-నెలవారీ జీతం చెల్లింపులకూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు.

-మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి ఇప్పటికే ఈ సమస్య చేరింది.

-కొద్ది నెలల కిందట కోవిడ్ విధుల్లోనే ఉన్న మెడికోలకు స్టైఫండ్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసినప్పుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందించాక ఆ     మొత్తాలు విడుదల చేశారు.

• వైద్య సిబ్బందికేదీ గౌరవం

-ఈ విధుల కోసమే 1170 మంది స్పెషలిస్ట్ వైద్యులను, 1170 మంది మెడికల్ ఆఫీసర్లను, 2వేలమంది నర్సులను, 1200కి పైగా పారా మెడికల్, ఇతర సిబ్బందిని   ప్రభుత్వం నియమించుకొంది.

-అదే విధంగా 1700 మంది ఆరోగ్య కార్యకర్తలకీ జీతాలు అందటం లేదు.

-నాదెండ్ల పి.హెచ్.సి.లోని వైద్యుడు తమ సమస్యను చెబితే అరెస్ట్ చేయమని కలెక్టర్ ఆదేశించడం ఆశ్చర్యం కలిగించింది.


Update: 2020-09-14 12:19 GMT

Linked news