Amaravati updates: మూడు రాజధానులపై సీఎం జగన్..
అమరావతి..
-ఏపీకి మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్తు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఫోన్ ట్యాపింగ్ వంటి పలు కీలక అంశాలపై ఒక జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి
-లక్ష కోట్ల ఖర్చు బెట్టి మహా నగరాన్ని నిర్మించడం సాధ్యం కాదు.
-దానివల్ల అదనపు ఆదాయం పక్కన పెడితే,మౌలిక సదుపాయాల కోసం చేసిన అప్పులు కూడా తీర్చలేము.
-అమెరికా ఆర్థిక వ్యవస్థలో మహా నగరాల పాత్ర ఎక్కడా?
-గతంలో విశాఖపట్నం రాజధాని కాదు చిన్న పట్నంలా ఉన్న సమయంలో దశాబ్దాల క్రితం స్టీల్ ప్లాంట్ తో చాలా పరిశ్రమలు వచ్చాయి.
-ఇప్పుడు విశాఖపట్నం మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది.
-పెట్టుబడులు అన్ని ఒక ప్రాంతంలో పెట్టడం కంటే అనేక ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చు.
-నగరాల ద్వారా ఆదాయాలు పెరుగుతాయని అనుకోవడం తప్పుడు ఆలోచన.
-ఒకటి రెండు మినహాయించి ప్రపంచంలో ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీస్ సఫలం కాలేదు.
-శివరామ కృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే మూడు ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం.
-ప్రభుత్వ పనులు మొత్తం ఒకే ప్రాంతం నుండి ఎందుకు జరగాలి.
-చెన్నై, హైదరాబాద్ ద్వారా రాష్ట్రం ఇప్పటికే నష్టం పోయిందని చరిత్ర చెప్తుంది.
-గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని కూడా మూడు ప్రాంతాలపై దృష్టి పెట్టాం
-1990లో గతంలో హైదరాబాద్ జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ తరహాలో అమరావతిలో కూడా చెయ్యాలని చూసారు.
-సచివాలయం,హైకోర్టు,అసెంబ్లీ వల్ల అభివృద్ధి జరగదు అని భావిస్తే వాటి కోసం ఎందుకు పట్టుబడుతున్నారు.
-అమరావతి ప్రాంతం భారీ నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదు.
-33వే ల ఎకరాలు రైతుల నుండి తీసుకోవడం కంటే మరో ప్రాంతంలో 500ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టి ఉండొచ్చు.
-*భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది*
-బినామిలు అందరూ బయటపడతారు.
-రాజధానిలో భూములు కొన్నవారు వేల కోట్లు సంపాదించారు.
-విశాఖపట్నం,అనంతపురం, కర్నూలు,తిరుపతి సహా రాష్జ్త్రంలో మరోకోన్నీ నగరాలు అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి.
-నేను అమరావతిని విస్మరించలేదు ఇక్కడ శాసన రాజధాని కొనసాగుతుంది
-దేశంలో రెఫరెండం కాన్సెప్ట్ ఉపయోగంలో లేదు అందుకే నిపుణుల సలహా తీసుకుంటున్నాం
-దేశంలో రెఫరెండం అప్షన్ ఉంటే ఈ అంశంపై రెఫరెండం కు వెళ్లే వాళ్ళం.
-అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజల మద్దత్తు ఉందని మాకు నమ్మకం.
-కేవలం29గ్రామాలు,10 వే ల మంది రైతులు అనేక కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారు కానీ, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అన్ని వికేంద్రీకరణకు మద్దత్తు ఇస్తున్నాయి
-చంద్రబాబుకు మరో ఎజెండా లేదు.
-గత 15నెలలుగా చంద్రబాబు అమరావతి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.
-మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ముందే చెప్పాము.
-అమరావతి అంత చర్చించదగిన అంశం కాదు
-ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన సీఎం
-ఆధారాలు సమర్పించాలని డిజిపి చంద్రబాబును కోరారు.
-ట్యాపింగ్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు.
-మేము ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మా ఫోన్ ట్యాప్ చేశారు. ఆధారాలు కూడా సమర్పించాం.
-కాంగ్రెస్,బీజేపీలపై మాది రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ.
-లోక్ సభలో నాలుగవ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయ లేదు.
-రాష్ట్ర విభజన అనంతరం కేవలం ఎపి అభివృద్ధిపై మాత్రమే మేము దృష్టి సారించాం.
-రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నాం.
-జాతీయ అంశాలు మాకు అంత ప్రాధాన్యత కాదు.
-కేంద్రంతో సంబంధాలు
-ఎపి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో మా మద్దతు ఉంటుంది.
-ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతుంది.
-రెవెన్యూ లోటుతో రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది.
-పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది.
-ప్రత్యేక ప్యాకేజి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
-జిఎస్టీ మినహాయింపు లపై కేంద్రంజిఎస్టీ చెల్లింపులలో కొంత ఆలస్యం చేసినప్పటికీ, పెద్ద ఎత్తున జిఎస్టీ చెల్లింపులు తగ్గించలేదు.
-కరోన నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కేంద్రo అర్థం చేసుకోవాలి.
-ప్రస్తుతంసంక్షోభం నుండి బయట పడాలి అంటే అప్పులు తెచ్చుకోవడమే మార్గం.
-ఇప్పటికే అదనంగా అప్పులు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
-ప్రజల పై పన్నుల భారం విధించలేము.
-ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తున్నాం.
-ఇంగ్లిష్ మీడియంపై సీఎం జగన్
-జాతీయ విద్యా విధానంలో కూడా 6వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియంకు శ్రీకారం చుట్టారు
-మేము ఇంగ్లీష్ మీడియం అమలు దిశగా అడుగులు వేశాం.
-జాతీయ విద్యా విధానంపై 2020 దేశంలో సమానత్వాన్ని తీసుకొస్తుంది.
-ఇంగ్లీష్ పై ప్రేమతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టలేదు.
-మాతృభాషను విస్మరించము విస్మరించే ఆలోచన కూడా లేదు.
-సమానత్వాన్ని తీసుకు రావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం
-స్థోమత ఉన్న వాళ్లు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం చదివిస్తుంటే పేద విద్యార్థులు మాత్రం ప్రాంతీయ భాషల్లో చదువుతున్నారు.
-ప్రయివేటు స్కూల్ నుండి వచ్చిన వారు ప్రభుత్వ,ప్రయివేటు రంగాల్లో అధిక శాతం ఉద్యోగాలు సాధిస్తున్నారు.
-సీఎం జగన్..