Amaravati updates: పవన్ కళ్యాణ్....జనసేన అధినేత..
అమరావతి..
-పవన్ కళ్యాణ్....జనసేన అధినేత
-తెలుగు భాషకు పట్టం కట్టడమే గిడుగు వారికి నిజమైన నివాళి
-ఈ రోజు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి
-దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాషను గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకువచ్చిన మహనీయులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు.
-ప్రజల వాడుకలో ఉన్న భాషనే గ్రంథ రచనలోకి తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో ఉద్యమించిన వ్యవహారిక భాషా ప్రేమికుడాయన.
-గిడుగు వెంకట రామమూర్తిగారు చేపట్టిన వ్యావహారిక భాషోద్యమం వల్లే పల్లె పల్లెకు చదువు అందింది.
-అది మన మాతృభాషలో... అందునా వాడుక భాషలో చదువుకోవడం మూలంగా ఎక్కువ మందికి విద్యాబుద్ధులు అందాయి.
-ఈ సందర్భంగా నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా వారికి అంజలి ఘటిస్తున్నాను.
-గిడుగు వెంకట రామమూర్తి గారి లాంటి ఎందరో భాషా ప్రేమికులు, కవులు, రచయితలు ఇచ్చిన స్పూర్తితోనే తెలుగు భాషలోని తీయదనాన్ని నవ తరానికి, భావి తరాలకు అందించే సదుద్దేశంతో జనసేన మన నుడి మన నది కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
-కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని స్పష్టంగా చెప్పింది.
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులకు మాతృభాష దూరం కాకుండా చూడటం అవసరం.
-అదే విధంగా ప్రభుత్వ వ్యవహారాలను తెలుగు భాషలో సాగించడమే కాదు అందులో వాడుక భాషను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది.
-ప్రభుత్వం ఉత్తర్వులు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లోని భాష కొరుకుడుపడని విధంగా ఉంటోంది.
-అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ భాష ఉండాలి.
-ప్రభుత్వ కార్యకలాపాల్లోనే కాకుండా ప్రతి ఒక్కరం నిత్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కట్టినప్పుడే గిడుగు వారికి నిజమైన నివాళిని ఇచ్చినట్లు అవుతుంది.
-ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.