తెలంగాణాలో రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు
తెలంగాణా సీయం కేసీఆర్ నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలుంటాయని చెప్పారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన ముఖ్య సూచనలు
- గత ఏడాది వానాకాలంలో మాదిరిగానే వరిని 40 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి.
- పత్తిని 70 లక్షల ఎకరాలకు పెంచాలి. గతంలో ఇది 53 లక్షల ఎకరాల్లో ఉంది.
- గతంలో 7 లక్షల ఎకరాల్లో కంది వేయగా ఇప్పుడు 15 లక్షల ఎకరాల్లో వేయాలి.
- పచ్చిరొట్టను విరివిగా సాగు చేయాలి.
- వానాకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు
- వరి వంగడాల్లో తెలంగాణ సోనాకు డిమాండ్ ఉన్నందున దానిని పండించడం మంచిది
Update: 2020-05-22 01:50 GMT