మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్...

తూర్పు గోదావరి:

పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్...

- గోదావరి జిల్లాలో వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలు స్థంబించి, కరెంటు లేక ప్రజల పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. పంటలు నీటమునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఒకవైపు కరోనాతో అల్లాడుతున్న ప్రజలపై, ఈ వరద ముంపు ఊహించని ఉపద్రవంగా పరిణామించింది.

- ముఖ్యంగా విలీనా మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూనవరం, విఆర్ పురం, చింతూరి, ఎటపాక మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

- దేవీపట్నం మండలంలోనే వేలాది ఇళ్లు నీట మునిగాయి.

- వందలాది గ్రామాలు వరద నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.

- కోనసీమలో లంక గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అనేక గ్రామాలు నీటమునిగాయి. కాజ్ వేలు మునిగిపోయి రహదారులు నీటమునిగాయి.

- కావున జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించి ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ దళాల ద్వారా సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలి. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలి. తాగునీరు, భోజనం, విద్యుత్ వసతులు కల్పించాలి.

- అంటువ్యాధులు ప్రబలకుండా సరైనా వైద్యం అందించాలి. పారిశుధ్య చర్యలు చేపట్టాలి.

Update: 2020-08-18 09:37 GMT

Linked news