స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నవ తెలంగాణ నిర్మాణం సాగాలి: కోదండరాం
నాంపల్లి జనసమితి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన కోదండరాం, హాజరైన పార్టీ కార్యకర్తలు నాయకులు.
మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్ర దినోత్సవం అని గుర్తు చేసుకోవడం అంటే సుదీర్ఘకాలంగా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకోవడమే.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిగా పెద్ద ఎత్తున స్వాతంత్ర్య పోరాటం కొనసాగింది. తో
బిర్సాముండా తిరుగుబాటుతో తో ప్రారంభమై... మొదటి స్వాతంత్ర పోరాటం తో ప్రజా ఉద్యమంగా మారింది.
ఆధునిక ప్రజాస్వామ్య విలువలతో పోరాటం నడిచి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము.
ఈ పోరాటంమే భారతదేశానికి ప్రజాస్వామ్య విలువలని, సామాజిక న్యాయాన్ని పరిచయం చేసింది.
స్వేచ్ఛ అంటే మనిషికి సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి, విముక్తి కాదు... పేదరికం నుంచి ఆధిపత్యం నుంచి దోపిడీ నుంచి విముక్తి లభించడం.
ఆ స్వేచ్ఛ కోసమే మనకు రాజ్యాంగం లో ఆదేశ సూత్రాలు వచ్చాయి.
ఆధిపత్యం నుంచి స్వేచ్ఛ కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది.
స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సాగింది.
స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా నవ తెలంగాణ నిర్మాణం సాగాలి.
భారత రాజ్యాంగం స్వాతంత్రోద్యమ విలువల ప్రతీక.
రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేయడం ద్వారా ఆధునిక భారత నిర్మాణాన్ని... నవ్య తెలంగాణ నిర్మించుకోవడం సాధ్యమవుతుంది.
ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణ కర్తవ్యంగా భావించాలి.