విశాఖకు అమ్మోనియం నైట్రేట్ ముప్పు లేదు.. తేల్చిచెప్పిన అధికారులు

 విశాఖ: విశాఖపట్నం లో ఓ ప్రవైటు షిప్పింగ్ సంస్థ లో మాత్రమే నిల్వలు గుర్తించిన అధికారులు.

- ఆ సంస్థ గిడ్డంగులను పరిశీలించిన అందులో 18,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ వుంది.

- విదేశాల నుండి దిగుమతి చేసుకున్న రసాయన లవణాన్ని గిడ్డంగిలో నిల్వ వుంచి సంబంధిత ఏజెన్సీలకు అందజేస్తారు.

- అటువంటి ఏజెన్సీలు ఆంధ్ర ప్రదేశ్ లో లేవు.

- ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నేరుగా విదేశాలకు ఆర్డర్లు చేసుకుంటారని, వారు దానిని నెలరోజుల లోగా తీసుకు వెళ్ళ వలసి వుంటుంది.

- సుమారు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈ లవణం మండుతుందని నిర్దారణ చేసారు..

- గోడౌన్ ను పరిశీలించిన అధికారులు ఇతర సాంకేతిక అంశాలను బేరీజు వేసి విశాఖ నగరానికి అమ్మోనియం నైట్రేట్ ముప్పు లేదని తేల్చారు.

- అయినప్పటికీ విపత్తుల శాఖ ద్వారా మరింత లోతుగా పరీక్షలు చేయించి ముందస్తు ప్రమాద నివారణ చర్యలు మరింత పక్కాగా అమలు చేయాలని సూచించారు.

- ఆర్.డి.వో., కె.పెంచల కిషోర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుభాన్, ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శంకర్ రెడ్డి గిడ్డంగిని పరిశీలించారు.

Update: 2020-08-08 08:40 GMT

Linked news