ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపిన మంత్రి వేముల

- దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం పట్ల శాసనసభ వ్యవరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- ఆయన మరణం వ్యక్తిగతంగా కలిచివేసిందన్నారు.

- ఉమ్మడి మెద‌క్ జిల్లాలోని దొమ్మాట, దుబ్బాక‌ నియోజక వర్గాల నుంచి నాలుగుసార్లు MLA గా గెలిచిన రామ‌లింగారెడ్డి నిరాడంబరుడనీ, ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

- జర్నలిస్ట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సోలిపేట కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.

- వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Update: 2020-08-06 04:41 GMT

Linked news