నిమ్మగడ్డ విషయంలో ఏపీ సర్కార్ కి సుప్రీం షాక్..!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సీఎం జగన్ సర్కార్ కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో కోర్టు థిక్కార పిటీషన్ పై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ పిటీషన్ ను తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. హైకోర్టు తీర్పు ఇచ్చినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏమయింది అని ప్రశ్నించింది. గవర్నర్ సలహాలు ఇవ్వాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు స్టే నిరాకరించడంతో హైకోర్టులో నిమ్మగడ్డ కోర్టు థిక్కార పిటీషన్ యధావిధిగా కొనసాగనుంది. కాగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ సూచించిన విషయం తెలిసిందే.
Update: 2020-07-24 09:11 GMT