మన్యంలో విస్తరిస్తున్న మహమ్మారి... అప్రమత్తమైన అధికారులు

విశాఖపట్నం: మన్యానికి కరోనా తాకిడి తగిలింది. అప్రమత్తమైన పాడేరు అధికారులు నియంత్రించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

- వ్యాపారరీత్యా అనకాపల్లితో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటూ... ప్రతిరోజు కిరాణా, ఇతర సామగ్రి కోసం మన్యం వాసులు అక్కడికి చాలామంది రాకపోకలు సాగిస్తుంటారు.

- మరోవైపు.. శుక్రవారం ఒక్క రోజే అనకాపల్లిలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

- ఫలితంగా.. మన్యానికి వ్యాపారులు రాకపోకలు నిలిపివేసేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.

- సరిహద్దుల్లో వాహనాలు నిలువరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

- హుకుంపేట సంతలో సరిహద్దులోని వాహనాలను ఇప్పటికే వెనక్కి పంపేశారు.

- పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం.. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.

- రద్దు విషయం తెలియని గిరిజనులు కొంత ఇబ్బందులు పడ్డారు. మన్యంలో ప్రస్తుతం ఐదు కేసులు నమోదు అయ్యాయి.

- మైదాన ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు మన్యంలో ప్రచారం చేస్తున్నారు.



Update: 2020-06-28 03:23 GMT

Linked news