Bikes And Scooters: అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులు, స్కూటర్లు ఇవే..!

Bikes And Scooters: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బైక్‌ లేదా స్కూటర్ ఉండాల్సిందే. లేదంటే రోజువారీ పనులు చేయడం కష్టంగా ఉంటుంది.

Update: 2023-09-29 15:30 GMT

Bikes And Scooters: అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులు, స్కూటర్లు ఇవే..!

Bikes And Scooters: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బైక్‌ లేదా స్కూటర్ ఉండాల్సిందే. లేదంటే రోజువారీ పనులు చేయడం కష్టంగా ఉంటుంది. అయితే అత్యధికంగా అమ్ముడయ్యే బైకులు, స్కూటర్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం. వాస్తవానికి సెప్టెంబరులో చాలా కొత్త వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. పండుగ ముందు ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతాయని అందరు భావిస్తున్నారు. అయితే సెప్టెంబర్‌లో ఎన్ని ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయో కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆగస్టులో విక్రయించిన ద్విచక్ర వాహనాల లెక్కలు చూద్దాం.

అత్యధికంగా అమ్ముడైన బైక్-స్కూటర్

ఆగస్ట్ 2023లో మోటర్‌ సైకిల్‌ విభాగంలో Hero Splendor ముందంజలో ఉంది. ఇది చాలా సంవత్సరాలుగా మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2,89,930 యూనిట్లను విక్రయించింది, ఇది వార్షిక ప్రాతిపదికన 1.37 శాతం పెరిగింది. అదే సమయంలో హోండా యాక్టివా, షైన్ వరుసగా 2,14,872 యూనిట్లు, 1,48,712 యూనిట్ల అమ్మకాలు చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. హోండా యాక్టివా విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 2.8 శాతం తగ్గగా, షైన్ అమ్మకాలు 23.7 శాతం పెరిగాయి.

పల్సర్ అమ్మకాలు క్షీణించాయి..

బజాజ్ పల్సర్ నాల్గవ స్థానంలో హీరో HF డీలక్స్ ఐదో స్థానంలో నిలిచాయి. పల్సర్‌ 90,685 యూనిట్లు, డీలక్స్‌ 73,006 యూనిట్లను విక్రయించారు. పల్సర్ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 6.6 శాతం క్షీణించాయి. అయితే కొత్తగా విడుదల చేసిన N150 మోడల్ మరింత విక్రయాలు జరుగతాయని భావిస్తున్నారు.

టాప్-10

ఆరు, ఏడో స్థానాల్లో రెండు ప్రసిద్ధ స్కూటర్లు ఉన్నాయి TVS జూపిటర్, సుజుకి యాక్సెస్. వీటి విక్రయాలు వరుసగా 70,065 యూనిట్లు, 53,651 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆ తర్వాత TVS రైడర్, బజాజ్ ప్లాటినా, హీరో ప్యాషన్ వరుసగా 42,375 యూనిట్లు, 40,693 యూనిట్లు, 38,043 యూనిట్ల విక్రయాలతో ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లోనిలిచాయి.

Tags:    

Similar News