Second Hand Car:సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా.. ఈ లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Second Hand Car: కరోనా పుణ్యమా అని సెకండ్ హ్యాండ్ కార్లకి విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో ప్రముఖ కార్ల కంపెనీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్ల అవుట్‌లెట్లని ప్రారంభిస్తున్నాయి.
Second Hand Car: కరోనా పుణ్యమా అని సెకండ్ హ్యాండ్ కార్లకి విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో ప్రముఖ కార్ల కంపెనీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్ల అవుట్‌లెట్లని ప్రారంభిస్తున్నాయి. చాలామంది యూజ్‌డ్ కార్ల వల్ల నష్టమే కానీ లాభం ఏది ఉండదు అంటారు. కానీ వీటివల్ల కూడా కొన్ని లాభాలు ఉంటాయి. కాకపోతే కొనేముందు జాగ్రత్తగా ఉండాలి కారు గురించి అవగాహన కలిగి ఉండాలి. ధర, పేపర్స్ విషయంలో అలర్ట్‌గా వ్యవహరించాలి. సెకండ్ హ్యాండ్ కారును కొనడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
తక్కువ ధరకే లభిస్తుంది
కొత్త కారుతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కారు తక్కువ ధరకే లభిస్తుంది. ఒక్కసారి కారు కొన్న తర్వాత షోరూమ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే దాని విలువ పడిపోతుంది. ఈ విషయంలో సెకండ్ హ్యాండ్ కారు బెస్ట్ అని చెప్పవచ్చు.
మోడిఫైడ్ సౌలభ్యం
మీరు కారులో ఏదైనా మార్పు చేయాలనుకుంటే సెకండ్ హ్యాండ్ కారులో సులభంగా చేయవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఏదైనా కొత్త ఫీచర్‌ని యాడ్ చేసుకోవచ్చు. కానీ కొత్త కారులో మార్పులు చేయడం కొంచెం ప్రమాదకరం. అంతేకాదు ఇన్సూరెన్స్ విషయంలో కూడా సమస్యలు ఏర్పడుతాయి.
బుకింగ్ సమస్య ఉండదు
కొత్త కారు కొనాలంటే ముందుగా బుక్ చేసుకోవాలి. ఇది మన ఇంటికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఎదురుచూడటం భారం అవుతుంది. కానీ సెకండ్ హ్యాండ్ కారుని ఉదయం కొని సాయంత్రం ఇంటికి తీసుకురావచ్చు. కారు అవసరం సులువుగా తీరుతుంది. బుకింగ్, డెలివరీ అంటూ ఏవి ఉండవు.
ఇన్సూరెన్స్, రోడ్డు పన్నుపై ఆదా
కొత్త కారు కొనేటప్పడు ఇన్సూరెన్స్, రహదారి పన్ను వంటి పెద్ద ఖర్చులను భరించాలి. కానీ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి ఖర్చులు ఉండవు. ఎందుకంటే అది ఇప్పటికే ఆర్టీవో ఆఫీసులో రిజిస్టర్ అయి ఉంటుంది. ఇన్సూరెన్స్, పన్నుల వంటివి గతంలోనే కట్టి ఉంటాయి. దీనివల్ల డబ్బులు ఆదా అవుతాయి.