Cheapest Electric Car: అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్.. తక్కువ ధరకే ఎక్కువ రేంజ్, టాప్ ఫీచర్లు..!

Cheapest Electric Car: ఎమ్‌జీ కామెట్ ఈవీని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 230 కిమీ రేంజ్ ఇస్తుంది.

Update: 2024-09-25 11:00 GMT

MG Comet EV

Cheapest Electric Car: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ నడుస్తోంది. వీటిని కొనుగోలు చేయడం, ఉపయోగించడం చాలా సులభం అయ్యింది. JSW MG మోటార్ ఇండియా కో. కంపెనీ అతి చిన్న, చౌకైన ఎలక్ట్రిక్ కార్ కామెట్ EVని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర ఇప్పుడు రూ. 4.99 లక్షలు (బ్యాటరీ లేకుండా). బ్యాటరీతో కూడిన కామెట్ EV ఎక్స్-షో రూమ్ ధర రూ. 6.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 5 గంటల్లో దాని బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

MG మోటార్ ఇండియా ఒక ప్రత్యేక 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అంటే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్. దీని కింద కామెట్ EV కిలోమీటరుకు బ్యాటరీ అద్దెను రూ. 4.99 లక్షలతో పాటు చెల్లించాలి. ఈ కార్యక్రమం కింద, కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి తమ ఆలోచనను మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్, EV మధ్య వ్యత్యాసం చాలా లేదు.

కామెట్ EV 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో అమర్చబడి ఉంది. దాని ఎలక్ట్రిక్ మోటార్ 42 PS పవర్‌, 110Nm టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230కిమీల రేంజ్‌ను అందిస్తుంది. 3.3kW ఛార్జర్‌తో దాని బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సుమారు 7 గంటలు పడుతుంది. అయితే 5 గంటల్లో దాని బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. కానీ ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌తో రాదు.

ఫీచర్ల గురించి మాట్లాడితే కామెట్ EV అనేది GSEV ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ కారు. ఇందులో 55 కంటే ఎక్కువ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు, 100 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. కామెట్ పొడవు 3 మీటర్ల కంటే తక్కువ. దీని టర్నింగ్ వ్యాసార్థం 4.2 మీటర్లు. అంటే మీరు చిన్న ప్రదేశాలలో కూడా సులభంగా ఉపయోగించవచ్చు.

MG కామెట్ EV డిజైన్ దాని అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇది బాక్సీ స్టైల్లో ఉంటుంది. ఎవరైనా ఈ కారును ఒక్కసారి చూస్తే కచ్చితంగా మళ్లీ మళ్లీ చూస్తారు. ఇందులో స్పేస్ చాలా బాగుంది. అందులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. ఈ కారులోని AC, దాని ఫీచర్లు చాలా బాగా పని చేస్తాయి. సిటీ డ్రైవ్ అయినా లేదా హైవే మీద డ్రైవింగ్ అయినా, కామెట్ నిరాశ పెట్టదు.

ఇది రోజువారీ ఉపయోగం కోసం ఉత్తమ ఎంపిక. కంపెనీ 230కిమీల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అయితే బ్యాక్ టైమ్ రేంజ్ 250-270కిమీగా ఉంటుంది. మీరు రోజూ ఆఫీసుకు కారులో వెళితే, మీ రోజువారీ రన్నింగ్ 50 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే MG కామెట్ EV మీకు సరైన కారు. పెట్రోల్ కారుతో పోలిస్తే ఇది మీకు చాలా డబ్బు ఆదా చేస్తుంది.

Tags:    

Similar News