TATA Harrier: నమ్మకమైన్ కార్.. టాటా హారియర్ డిమాండ్ తగ్గేలేలా లేదు!
TATA Harrier: సెప్టెంబర్ 2024 నెలలో టాటా హారియర్ మోడల్ సేల్స్ డేటాను వెల్లడైంది.
TATA Harrier: టాటా మోటార్స్ భారతదేశంలో నమ్మకమైన కార్ల తయారీ సంస్థగా పేరుగాంచింది. టాటా కంపెనీ హారియర్ ఫేస్‌లిఫ్ట్ SUVని పరిచయం చేసింది. ఇది దాని హారియర్ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో చాలా వినూత్న మార్పులు, పీచర్లను పొందుతుంది. ఇది వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించింది. టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ సెఫ్టీ, ఫీచర్లతో SUVకి కొత్త అప్‌డేట్‌లతో మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ టాటా హ్యారియర్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో బాగా అమ్ముడవుతోంది.
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జీ హెక్టర్, జీప్ కంపాస్ ఈ టాటా హారియర్ మోడల్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. సెప్టెంబర్ 2024 నెలలో టాటా హారియర్ మోడల్ సేల్స్ డేటాను వెల్లడైంది. నివేదిక ప్రకారం గత నెలలో టాటా హారియర్ మోడల్ 1,600 యూనిట్లు అమ్ముడయ్యాయి.
గతేడాది సెప్టెంబర్‌లో 926 యూనిట్ల హారియర్ మోడల్ అమ్ముడైంది. గత నెల విక్రయాలతో పోలిస్తే 73 శాతం వృద్ధిని సాధించింది. ప్రముఖ టాటా హారియర్ SUV వినియోగదారులకు లూనార్ వైట్, పెబుల్ గ్రే, సన్‌లైట్ ఎల్లో, కోరల్ రెడ్ వంటి 6 ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది.
టాటా హారియర్ SUV ఇంజన్ గురించి మాట్లాడితే ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 170 hp పవర్‌ని 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌తో 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. ఈ SUVలో ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.
టాటా హారియర్ ఎస్‌యూవీలో అందరినీ ఆకట్టుకునే డిజైన్ ఉంది. కొత్త గ్రిల్, స్ప్లిట్ హెడ్‌లైట్‌లతో సహా ముందు భాగంలో చాలా అప్‌డేట్‌లు ఉన్నాయి. అదనంగా గ్రిల్ పైభాగంలో పూర్తి వెడల్పు LED లైట్ బార్ ఉంటుంది. దీనితో పాటు బంపర్ కూడా కొత్తది, అయితే హారియర్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ పెద్దగా మారలేదు.
ఈ ఎస్‌యూవీలో 18, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ SUV వెనుక భాగంలో అనేక ఆవిష్కరణలు ఉన్నాయి. అప్‌డేట్ చేసిన బంపర్, LED లైటింగ్ ఉంది. దీని మొత్తం డిజైన్ గత జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. హారియర్ EVని పోలి ఉంటుంది.
ఈ టాటా హారియర్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇది వేరియంట్‌లను బట్టి 10.25 అంగుళాల లేదా 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. టాటా SUVకి LED యాంబియంట్ లైటింగ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టాటా లోగోతో కూడిన కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
దీనితో పాటు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 10 స్పీకర్ JBL ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ NCAP పరీక్షలో అడల్ట్ సేఫ్టీ విభాగంలో 34 పాయింట్లకు 33.05 పాయింట్లు సాధించి, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొంది. హారియర్ భద్రత పరంగా అత్యుత్తమ కారుగా గుర్తింపు పొందింది.