Astro News: 18 ఏళ్ల తర్వాత రాహువు సూర్యుడి కలయిక. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!
Astro News: జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల కలయిక వివిధ రాశులపై ప్రభావం చూపుతుంది.
Astro News: జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల కలయిక వివిధ రాశులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలగగా మరికొందరికి అశుభ ఫలితాలు కలుగుతాయి. అయితే 18 సంవత్సరాల తర్వాత రెండు రాశులు మళ్లీ కలుస్తున్నాయి. దీనివల్ల మూడు రాశుల వారికి ధన ప్రవాహం వరదలా వచ్చి పడుతుంది. వారు పట్టిందల్లా బంగారమవుతుంది. మార్చి 14, 2024న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ పరిస్థితిలో రాహువు ఇప్పటికే అక్కడ ఉన్నాడు. రాహువుతో సూర్యుని కలయిక అనేక రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఏ రాశులవారికి మంచి ఫలితాలు కలుగనున్నాయో ఈ రోజు తెలుసుకుందాం.
మకరరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలయిక మకరరాశి వారికి శుభప్రదం. వీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. జీవితంలో కొత్త ఆనందం రాబోతుంది మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఏదైనా వ్యాపారం చేస్తే పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. వృత్తిలో వృద్ధికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో జీతం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు జీవితంలో కొత్త ప్రారంభాన్ని పొందుతారు.
సింహరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, సూర్య కలయిక వల్ల సింహ రాశి వారికి అర్థం చేసుకునే సామర్థ్యాం పెరుగుతుంది. తెలివితేటల ఆధారంగా కొత్త ఎత్తులను సాధించగలుగుతారు. వ్యాపారాలలో ధనలాభం సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది. అనేక కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొత్త బంధాలు మొదలవుతాయి.
వృషభం
ఈ రాశివారికి సూర్యుడు రాహువు కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి కోరికలు నెరవేరుతాయి శ్రమ ఫలిస్తుంది. కెరీర్, వ్యక్తిగత జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఏదైనా వ్యాపారం చేస్తే పెద్ద ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు అందుకుంటారు జీతం పెరుగుతుంది. ఇంక్రిమెంట్ ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.