Maruti Suzuki: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆల్టో కే10 నుంచి సెలెరియా వరకు.. 9 మోడళ్ల ధరలను తగ్గించిన మారుతీ సుజుకీ..

Maruti Suzuki: మారుతీ సుజుకి ఇండియా శనివారం తన ఆటో గేర్ షిఫ్ట్ (AGS) లైనప్‌లోని పలు మోడళ్ల ధరలను రూ. 5,000 తగ్గించింది. ఈ మోడళ్లలో Alto K10, S-Presso, Celerio, Wagon-R, Swift, DZire, Baleno, Forex, Ignis ఉన్నాయి. అన్ని మోడళ్ల కొత్త ధరలు జూన్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి.

Update: 2024-06-02 11:30 GMT

మారుతి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ..

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ సమాచారాన్ని అందించింది. ఆటో గేర్ షిఫ్ట్ (AGS) అనేది 2014లో మారుతి సుజుకి ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ.

ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ప్రయోజనాలను మిళితం చేస్తుంది. ఇది ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రానిక్ కంట్రోలర్ యూనిట్ ద్వారా నిర్వహించే ఇంటెలిజెంట్ షిఫ్ట్ కంట్రోల్ యాక్యుయేటర్‌ను కలిగి ఉంటుంది.

ఈ సిస్టమ్ డ్రైవర్ నియంత్రణ లేకుండా గేర్ షిఫ్ట్, క్లచ్ నియంత్రణలను నిర్వహిస్తుంది. ఇది క్లచ్, స్మూత్ గేర్ షిఫ్ట్‌ల సమకాలీకరణ నియంత్రణను నిర్ధారిస్తుంది. ఇది డ్రైవింగ్ పనితీరు, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది.

ధరలను తగ్గించడం ద్వారా AGS వేరియంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే మారుతి లక్ష్యం. తద్వారా పోటీ మార్కెట్‌లో విక్రయాలు పెంచుకోవచ్చు.

స్విఫ్ట్, గ్రాండ్ విటారా ధరలను పెంచిన మారుతి సుజుకి ..

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ప్రముఖ మోడల్స్ స్విఫ్ట్, గ్రాండ్ విటారా ఎంపిక చేసిన వేరియంట్‌ల ధరలను పెంచింది. స్విఫ్ట్ ధరను రూ. 25,000 వరకు పెంచింది. గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ధర రూ. 19,000 వరకు పెరిగింది.

Tags:    

Similar News