Car Mileage Tips: ఈ 4 మార్గాల్లో మైలేజీని పెంచుకోండి.. డబ్బులు ఆదా చేసుకోండి..!
Car Mileage Tips: ఈ రోజుల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. దీనివల్ల సామాన్యులు వాహనాలని మెయింటెన్ చేయడం చాలా కష్టంగా మారుతుంది.
Car Mileage Tips: ఈ రోజుల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. దీనివల్ల సామాన్యులు వాహనాలని మెయింటెన్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో కారు ఉన్న వ్యక్తులు ఆచితూచి అడుగువేయాలి. మైలేజీ పెంచడానికి ప్రయత్నించాలి. దీనివల్ల ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుంది. లేదంటే వచ్చే జీతం మొత్తం కారులో పెట్రోల్ కొట్టించడానికే సరిపోతుంది. నాలుగు మార్గాల ద్వారా కారు మైలేజీ పెంచుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
స్మూత్ డ్రైవింగ్
కారు మంచి మైలేజీని ఇవ్వాలంటే ఎప్పుడూ స్మూత్‌గా డ్రైవింగ్ చేయాలి. తరచుగా బ్రేకులు వేయకూడదు. దీనివల్ల మైలేజీపై ఎఫెక్ట్ పడుతుంది. కారు వేగాన్ని నెమ్మదిగా పెంచాలి. ఒకే వేగంతో నడుపుతూ ఉండేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల మంచి మైలేజీ వస్తుంది.
కారు మెయింటనెన్స్
కారు మెయింటనెన్స్ తప్పనిసరిగా చేయాలి. కారును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఏదైనా లోపం ఉంటే వెంటనే సరిచేయాలి. దీనివల్ల కారుకి ఎటువంటి నష్టం జరగదు. మైలేజీపై కూడా ప్రభావం పడదు.
టైర్లలో గాలి
కారులోని నాలుగు టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. కచ్చితమైన గాలి ఉండటం వల్ల టైర్‌పై ప్రెజర్ తగ్గి మంచి మైలేజీ వస్తుంది. దీనివల్ల ఎంతో కొంత డబ్బు ఆదా చేస్తారు.
ఓవర్‌లోడ్‌ను నివారించాలి
కారులో ఓవర్‌లోడింగ్ వల్ల ఇంజిన్‌పై ప్రభావం పడుతుంది. దీని వల్ల కారు మైలేజ్ తగ్గుతుంది. అందుకే కారు కెపాసిటిని బట్టి లోడ్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఈ చిట్కాలను పాటిస్తే కారు మైలేజ్ పెరుగుతుంది. ఇది రోజువారీ ఖర్చులపై ప్రభావాన్ని చూపుతుంది చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు.