Car Exports: భాతర్ కార్లకు ఫుల్ డిమాండ్.. 14 శాతం పెరిగిన ఎగుముతులు!

Car Exports: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో భారత్ నుంచి ఆటోమొబైల్ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగాయి.

Update: 2024-10-22 01:30 GMT

Car Exports: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో భారత్ నుంచి ఆటోమొబైల్ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల ఎగుమతులు పెరగడం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం ఏప్రిల్-సెప్టెంబర్‌లో మొత్తం ఎగుమతులు 25,28,248 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఏడాది క్రితం ఇదే కాలంలో 22,11,457 యూనిట్ల కంటే 14 శాతం ఎక్కువ.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. వివిధ కారణాలతో మందగించిన లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి ప్రధాన మార్కెట్లు ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. ఎగుమతులు తిరిగి రావడానికి ఇదే ప్రధాన కారణం. కరెన్సీ విలువ తగ్గింపు కారణంగా అనేక ఆఫ్రికన్ దేశాలు, ఇతర ప్రాంతాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఈ దేశాలు నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవడంపై దృష్టి సారించడంతో ఇది వాహన రవాణాపై ప్రభావం చూపింది.

అనేక విదేశీ మార్కెట్లలో ద్రవ్య సంక్షోభం కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ ఎగుమతులు 5.5 శాతం క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 45,00,492 యూనిట్లుగా ఉండగా FY 23లో ఇది 47,61,299 యూనిట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి 3,76,679 యూనిట్లకు చేరాయి. FY24 సెప్టెంబర్ త్రైమాసికంలో 3,36,754 యూనిట్లు ఉన్నాయి.

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 1,47,063 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో 1,31,546 యూనిట్ల కంటే 12 శాతం ఎక్కువ. హ్యుందాయ్ మోటార్ ఇండియా 84,900 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 86,105 యూనిట్లతో పోలిస్తే 1 శాతం తక్కువ.

Tags:    

Similar News