Car Battery Problems: కారులో ఈ సమస్యలు ఉన్నాయా.. బ్యాటరీ పాడైపోయిందని అర్థం..!
Car Battery Problems: కారు ఉన్నప్పుడు మెయింటనెన్స్ అనేది చాలా ముఖ్యం లేదంటే ప్రయాణం మధ్యలో ఇబ్బందులు ఎదురవుతాయి.
Car Battery Problems: కారు ఉన్నప్పుడు మెయింటనెన్స్ అనేది చాలా ముఖ్యం లేదంటే ప్రయాణం మధ్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. కారు కండీషన్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. కారు లోపల కొన్ని రకాల సమస్యలు ఎదురైనప్పుడు అవి వీక్ బ్యాటరీ సంకేతాలు అని గుర్తించాలి. వెంటనే బ్యాటరీని చెక్ చేసి రిపేర్ చేయించాలి లేదంటే కొత్తది మార్చాలి. ఇలా చేయకపోతే రోడ్డు మధ్యలో కారు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ వీక్ అయినప్పుడు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఈరోజు తెలుసుకుందాం.
డిమ్ లైట్: కారులో విద్యుత్ వ్యవస్థ పనిచేయడానికి బ్యాటరీ బాధ్యత వహిస్తుంది. హెడ్‌లైట్ తక్కువగా వెలుగుతుంటే బ్యాటరీ వీక్ అయిందని అర్థం చేసుకోవాలి. ఇది సులభమైన మార్గం. హెడ్‌లైట్‌లు, యాక్సెసరీలు డిమ్ లైట్‌లో పనిచేస్తుంటే అది చెడ్డ బ్యాటరీ లక్షణం అవుతుంది.
కారు స్టార్ట్ చేస్తున్నప్పుడు శబ్దం: కారును స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారిగా పెద్ద శబ్దం వస్తే బ్యాటరీ సమస్య ఉన్నట్లే. సాధారణంగా కార్లు స్టార్ట్ చేసేటప్పుడు పెద్దగా శబ్దం రాదు. కానీ విచిత్రమైన పెద్ద శబ్దం వస్తుంటే బ్యాటరీని చెక్ చేయడం అవసరం.
క్రాంక్ శబ్దం: కీ పెట్టి కారు స్టార్ట్ చేసేటప్పుడు క్రాంక్ శబ్దం చాలా సేపు వచ్చిందంటే బ్యాటరీ సమస్య ఉన్నట్లే. క్రాంక్ సమయంలో ఇంజిన్ స్లోగా అనిపిస్తే బ్యాటరీ చెక్ చేయాలి. లేదంటే మరమ్మతు అవసరమని అర్థం.
బ్యాక్‌ఫైర్: బ్యాటరీ వీక్ అయినప్పుడు కారులో బ్యాక్‌ఫైరింగ్ జరుగుతుంది. చెడ్డ బ్యాటరీ వల్ల అడపాదడపా స్పార్కింగ్ ప్రమాదం పొంచి ఉంటుంది.
తుప్పు పట్టడం: బ్యాటరీపై తుప్పు పట్టడం వల్ల కూడా వీక్ అవుతుంది. బ్యాటరీ టెర్మినేటర్‌కి కనెక్ట్ అయ్యే చోట తుప్పు పట్టడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. భారతదేశంలో వాహన బ్యాటరీల సగటు జీవితం 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే. తరువాత బ్యాటరీని చెక్‌చేసి అవసరాన్ని బట్టి కొత్త బ్యాటరీని ఉపయోగించాలి.