Car Care Tips: కారు నడుస్తున్నప్పుడు టైర్ పంక్చర్‌ అయితే ఎలా గుర్తించాలి..?

Car Care Tips: చాలామంది కారు నడుపుతున్నప్పుడు టైర్‌ పంక్చర్‌ అయితే గుర్తించలేరు. కారుని అలాగే నడుపుతూ వెళుతుంటారు.

Update: 2023-09-20 07:45 GMT

Car Care Tips: కారు నడుస్తున్నప్పుడు టైర్ పంక్చర్‌ అయితే ఎలా గుర్తించాలి..?

Car Care Tips: చాలామంది కారు నడుపుతున్నప్పుడు టైర్‌ పంక్చర్‌ అయితే గుర్తించలేరు. కారుని అలాగే నడుపుతూ వెళుతుంటారు. దీనివల్ల టైర్ పాడవుతుంది కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టైర్ పంక్చర్ అయితే అస్సలు గుర్తించలేరు. ఈ పరిస్థితిలో కారు టైర్ ఖచ్చితంగా పాడవుతుంది. తర్వాత కొత్త టైర్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకే వెహికిల్‌ రన్నింగ్‌ సమయంలో టైర్ పంక్చర్ అయితే ఎలా గుర్తించాలో ఈ రోజు తెలుసుకుందాం.

ముందు టైరు పంక్చర్

ముందుగా ముందు టైర్ల గురించి మాట్లాడుకుందాం. కారు ముందు టైర్‌ పంక్చర్ అయినట్లయితే ఏ వైపు టైర్‌ పంక్చర్‌ అయిందో ఆ వైపునకు కారు దానంతట అదే వెళుతుంటుంది. స్టీరింగ్ కంట్రోల్‌ చేయడం కొంచెం కష్టం అవుతుంది. స్టీరింగ్‌ను నియంత్రించడానికి మరింత శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎడమ టైరు పంక్చర్ అయినట్లయితే కారు మళ్లీ మళ్లీ ఎడమ వైపుకు వెళుతుంటుంది. కుడి వైపు టైర్ పంక్చర్ అయితే కారు మళ్లీ మళ్లీ కుడి వైపుకు వెళుతుంటుంది. ఇలా జరిగితే వెంటనే కారు ఆపి టైర్లను చెక్ చేయాలి.

వెనుక టైరు పంక్చర్

కదులుతున్న కారు వెనుక టైర్‌ పంక్చర్‌ అయితే గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ముందుగా కారు పికప్ తగ్గుతుంది. కారుని ఎవరో వెనక్కి లాగినట్లు అనిపిస్తుంటుంది. కారు ఒత్తిడిలో కదులుతున్నట్లు భావిస్తారు. ముందుకు సాగడానికి మరింత శక్తి అవసరమవుతుంది. పంక్చర్ కారణంగా కారు బ్యాలెన్స్ అవుట్‌ అవుతుంది. వాహనాన్ని నియంత్రించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకసారి దిగి కారు టైర్లను చెక్ చేయాలి.

టైర్ పంక్చర్ అయితే ఏం చేయాలి?

టైర్ పంక్చర్ అయినట్లయితే కారును పార్క్ చేసి స్టెప్నీ టైర్‌ను అమర్చాలి. కానీ స్టెప్నీ టైర్‌ను మెయిన్‌ టైర్‌గా ఉపయోగించకూడదు. ఎక్కడైనా మెకానిక్‌ కనిపిస్తే మెయిన్‌ టైర్‌ని రిపేర్ చేసి మళ్లీ దానినే ఉపయోగించాలి.

Tags:    

Similar News