Hero Vida V1 Plus: రాఖీ ఆఫర్.. హీరో స్కూటర్‌పై రూ.32 వేల డిస్కౌంట్..!

Hero Vida V1 Plus: హీరో మోటోకార్ప్ తన ప్రముఖ స్కూటర్ విడా వి1 ప్లస్‌పై బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. కొనుగోలు చేయడం ద్వారా రూ. 32,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Update: 2024-08-17 14:00 GMT

Hero Vida V1 Plus

Hero Vida V1 Plus: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో చాలా మంది మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నందున వారి రోజువారీ అవసరాలకు ద్విచక్ర వాహనాలు చాలా ముఖ్యమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం పెట్రోల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల రన్నింగ్ ఖర్చు తక్కువ. మరొక కారణం దాని సులభమైన్ ఛార్జింగ్. బైక్‌లతో పోలిస్తే స్కూటర్‌లు గేర్‌లెస్‌గా ఉంటాయి. ఇవి అన్ని వయసుల వారికి కంఫర్ట్‌గా ఉంటాయి. అయితే పెట్రోల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది.

అందుకే ప్రజలు వాటిని కొనడానికి కొంచెం వెనుకాడతారు. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను పెంచడానికి, కంపెనీలు నిరంతరం ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. హీరో మోటోకార్ప్ తన ప్రముఖ స్కూటర్ విడా వి1 ప్లస్‌పై బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. ఇప్పుడు మీరు Hero Vida V1 Plusని కొనుగోలు చేయడం ద్వారా రూ. 29,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఈ రక్షాబంధన్‌లో మీ సోదరికి సరికొత్త స్కూటర్‌ను బహుమతిగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లయితే హీరో విడా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గొప్ప ఎంపిక. హీరో ఇస్తున్న ఈ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

Hero Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు Amazon, Flipkartలో రూ. 32,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25,000 ఆఫర్‌తో అందుబాటులో ఉండగా మీరు అమెజాన్‌లో గరిష్టంగా రూ. 32,000 డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఈ ప్రత్యేక ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు వాహనాన్ని ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయాలి.

మీరు Amazon నుండి Hero Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తుంటే మీకు ఫుల్ పేమెంట్‌పై రూ. 27,000 వరకు తగ్గింపు లభిస్తుంది. EMIలో కొనుగోలు చేయాలని చూస్తుంటే మీరు రూ. 32,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ తర్వాత ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు వరుసగా రూ.91,000, రూ.94,000 వరకు తగ్గుతాయి. హీరో విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.20 లక్షల వరకు ఉండవచ్చు. అమ్మకాలను రెట్టింపు చేసేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని హీరో మోటోకార్ప్ తెలిపింది.

Tags:    

Similar News