Unsafe Cars: ఈ కార్లు కొనేముందు ఒకసారి ఆలోచించండి.. ఎందుకంటే?
Unsafe Cars: మారుతి సుజుకి (Maruti Suzuki) భారతదేశంలో చౌకైన, అధిక మైలేజీ గల కార్లను మాత్రమే అందిస్తుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజికి నుంచి హ్యుందాయ్ (Hyundai) వరకు భద్రత పరంగా ప్లాప్ అయిన కార్ల గురించి తెలుసుకుందాం.
Unsafe Cars: మారుతి సుజుకి కొత్త డిజైర్ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఆ తర్వాత మారుతి గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మారుతి సుజుకి డిజైర్ వంటి బలహీనమైన కారు 5 స్టార్ రేటింగ్‌ను ఎలా పొందిందోఅని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇంతకు ముందు కూడా డిజైర్ సేఫ్టీ పరంగా ఫ్లాప్ అయ్యింది. మారుతి సుజుకి భారతదేశంలో చౌకైన, అధిక మైలేజీ గల కార్లను మాత్రమే అందిస్తుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజికి నుంచి హ్యుందాయ్ వరకు భద్రత పరంగా ప్లాప్ అయిన కార్ల గురించి తెలుసుకుందాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్‌లో విపరీతంగా అమ్ముడవుతున్న కార్లు క్రాష్ టెస్ట్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాయి. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే దాని కంటే ముందు ఈ లిస్ట్‌ని తప్పకుండా చెక్ చేయండి.
మారుతి ఆల్టో కె10
మారుతి సుజుకి ఆల్టో K10 షైన్ క్రమంగా తగ్గుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కారు చాలా ఖరీదైనదిగా మారింది. దాని పనితీరు కూడా చాలా తక్కువగా ఉంది. ఇది సౌకర్యవంతమైన కారు కాదు. దీని డిజైన్, ఇంటీరియర్ అంతగా అట్రాక్ట్ చేయవు. ఈ కారు కొనడం కేవలం డబ్బు వృధా అని నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో విఫలమైంది. ఇది పెద్దల భద్రతలో 2 స్టార్ రేటింగ్ ,పిల్లల భద్రతలో జీరో స్టార్ రేటింగ్ సాధించింది.
మారుతి వ్యాగన్ఆర్
మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ కూడా సురక్షితమై కారు కాదు. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో ఈ కారు భారీగా ఫ్లాప్ అయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ కారును ప్రజలు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇది కూడా ఎలాంటి సౌకర్యం లేని కారు. ఇది పెద్దల భద్రతలో 1 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతలో జీరో స్టార్ రేటింగ్‌ను పొందింది. ప్రమాదం జరిగినప్పుడు ఈ కారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచదని చెబుతున్నారు ఆటో ప్రియులు.
మారుతి S-ప్రెస్సో
మారుతి సుజుకి S-ప్రెస్సో డిజైన్, ఇంటీరియర్ బాగుంది. దీని పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో కూడా విఫలమైంది. అంటే ఈ కారులో మీకు ఎలాంటి భద్రత ఉండదు. ఇప్పుడు ఇది చాలా ఖరీదైనదిగా మారినందున ఈ కారు అమ్మకాలు నిరంతరం పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ కారు కొనడం డబ్బు వృధా తప్ప మరొకటి కాదని టాక్ వినిపిస్తుంది.
రెనాల్ట్ కివిడ్
రెనాల్ట్ కివిడ్ డిజైన్ చాలా బాగుంది కానీ దాని బిల్డ్ క్వాలిటీ అధ్వాన్నంగా ఉంది. ఇది చాలా బలహీనమైన కారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 2 స్టార్ రేటింగ్‌ను పొందింది. దీని విక్రయాలు కూడా నిరంతరం పడిపోతున్నాయి. భద్రత పరంగా ఈ కారు కొనడం మంచిదికాదని అంటున్నారు నిపుణులు.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అద్భుతమైనది. ఈ కారు సెగ్మెంట్లో అత్యంత సౌకర్యవంతమైన కారు. కానీ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో దీనికి 2 స్టార్ రేటింగ్ వచ్చింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఈ కారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచదని చెబుతున్నారు.