Electric Bikes: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీల నాన్ స్టాప్ జర్నీ.. ఫీచర్లతో ది బెస్ట్.. టాప్ 3 ఎలక్ట్రిక్ బైక్స్ మీకోసం..!

Best Electric Bikes: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎన్నో ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

Update: 2023-04-22 13:30 GMT

Electric Bikes: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీల నాన్ స్టాప్ జర్నీ.. ఫీచర్లతో ది బెస్ట్.. టాప్ 3 ఎలక్ట్రిక్ బైక్స్ మీకోసం..!

Best Electric Bikes in India 2023: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎన్నో ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టూ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే.. కస్టమర్లకు చాలా మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎలక్ట్రిక్ స్కూటర్ల రూపంలో ఎక్కువ ఆఫ్షన్ ఉండగా, ఎలక్ట్రిక్ బైక్‌లకు మాత్రం ఇప్పటికీ పరిమితంగా ఆఫ్షన్స్ ఉన్నాయి. భారతదేశంలో 3 అత్యంత మైలేజీని అందించే ఎలక్ట్రిక్ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ultraviolette F77 Electric Bike: అల్ట్రావైలెట్‌ F77 కంపెనీ నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ బైక్. బైక్ F77 పేరుతో విడుదలైంది. బైక్ స్టాండర్డ్, రీకాన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని స్టాండర్డ్ వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 206KM వరకు నాన్ స్టాప్ జర్నీని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే రీకాన్ వేరియంట్ 10.5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 307KM ల వరకు నాన్ స్టాప్ జర్నీ చేయవచ్చు. కాగా, బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 5 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది.

ఈ అల్ట్రావైలెట్‌ F77 బైక్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60KMPH వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం 152Kmph. అయితే, దాని ధర చాలా ఎక్కువగా ఉందండోయ్. అల్ట్రావైలెట్‌ F77 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.3.80 లక్షలు కాగా, రీకాన్ వేరియంట్ ధర రూ.4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కూడా అందుబాటులో ఉంచారు. కాగా, దీని ధర రూ. 5.50 లక్షలుగా నిర్ణయించారు.

Komaki Ranger: కొమాకి రేంజర్ భారతదేశ మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. ఇందులో 3.6kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ బైక్‌లో 4kW BLDC ఎలక్ట్రిక్ మోటార్‌ని అందించారు. దీని గరిష్ట వేగం 80KMPHగా కంపెనీ పేర్కొంది. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటలు పడుతుందంట.

బైక్‌తో పాటు ఫాక్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అందించారు. అలాగే ఈ బైక్‌లో స్పీకర్లు కూడా ఉన్నాయి. తద్వారా ICE బైక్ వంటి కృత్రిమ ధ్వనిని పొందవచ్చు. LED లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ క్రూయిజ్ కంట్రోల్, సైడ్ స్టాండ్ సెన్సార్లు వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ బైక్ ఖరీదు రూ.1.85 లక్షలు.

Oben Rorr: ఈ ఎలక్ట్రిక్ బైక్ స్పోర్టీ లుక్, డిజైన్‌తో వస్తుంది. ఇందులో 4.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 187 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 3 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్ని అందుకోగలదు.

దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. అలాగే ఈ బైక్ బ్యాటరీ 2 గంటల్లో 80% వరకు ఛార్జ్ అవుతుందంట. ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, థెఫ్ట్ ప్రొటెక్షన్ వంటి అనేక ఫీచర్లు ఇందులో అందించారు. కాగా, ఈ బైక్ ప్రైజ్ రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు.

Tags:    

Similar News