Safest Cars: నెక్సాన్ నుంచి కుషాక్ వరకు.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పొందిన 5 ఎస్‌యూవీలు ఇవే..!

Safest SUV In India: ప్రస్తుత కాలంలో, వినియోగదారులు కారు భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇది చాలామంచి విషయం. కారును ఎంచుకోవాలనే వ్యక్తుల నిర్ణయంలో భద్రత ఒక పెద్ద అంశం.

Update: 2023-08-22 16:00 GMT

Safest Cars: నెక్సాన్ నుంచి కుషాక్ వరకు.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పొందిన 5 ఎస్‌యూవీలు ఇవే..!

Safest SUV: ప్రస్తుత కాలంలో, వినియోగదారులు కారు భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇది చాలామంచి విషయం. కారును ఎంచుకోవాలనే వ్యక్తుల నిర్ణయంలో భద్రత ఒక పెద్ద అంశం. దీనితో పాటు, ఇప్పుడు భారతీయ మార్కెట్లో SUV లకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది ప్రజలు SUV ల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి భారతదేశంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో 5 SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. VW TAIGUN & SKODA KUSHAQ

GNCAP (గ్లోబల్ NCAP) ద్వారా భారతీయ నిర్మిత VW టైగన్ అండ్ స్కోడా కుషాక్ 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్‌లను (పెద్దలు, పిల్లలకు ఇద్దరికీ) అందించాయి. దీంతో ఈ రెండూ అత్యంత సురక్షితమైన మేడ్-ఇన్-ఇండియా SUVలుగా మారాయి. ఇది MQB AO IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు.

2. టాటా పంచ్ (TATA PUNCH)

టాటా మోటార్స్ మైక్రో SUV - పంచ్ చాలా ప్రజాదరణ పొందింది. దాని వెనుక ఒక అంశం భద్రత. ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ మైక్రో SUVకి గ్లోబల్ NCAP నుంచి పెద్దలకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, పిల్లలకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది.

3. మహీంద్రా XUV300 (MAHINDRA XUV300)

మహీంద్రా XUV300 పేరు భారతదేశపు అత్యంత సురక్షితమైన SUVలో కూడా వస్తుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అయితే, పిల్లలకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది.

4. మహీంద్రా XUV700 (MAHINDRA XUV700)

మహీంద్రా XUV700 కూడా జాబితాలో చేరింది. గ్లోబల్ NCAP దీనికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. ఇది పెద్దలకు 5 స్టార్ రేటింగ్, పిల్లలకు 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. అంటే, ఇది సురక్షితమైన SUVలలో ఒకటి.

5. టాటా నెక్సాన్(TATA NEXON)

గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన భారతదేశంలో మొదటి SUV టాటా నెక్సాన్. దీని తర్వాత మాత్రమే ఇతర కార్లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. అంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన తొలి భారతీయ కారు ఇదే కావడం గమనార్హం.

Tags:    

Similar News