Best Selling SUV: క్రెటా నుంచి స్కార్పియో వరకు.. ఫిదా చేస్తోన్న 5 మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే..!
Best Selling SUV: గత కొన్ని సంవత్సరాలుగా, SUVలు భారతీయ కార్ల కొనుగోలుదారుల మనసు గెలుచుకుంటున్నాయి.
Best Selling Mid-Size SUV: గత కొన్ని సంవత్సరాలుగా, SUVలు భారతీయ కార్ల కొనుగోలుదారుల మనసు గెలుచుకుంటున్నాయి. SUV స్పేస్ కూడా అనేక ఉప-విభాగాలుగా మార్చారు. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో మంచి అమ్మకాలు ఉన్నాయి. ఆగస్టు 2023లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 మిడ్-సైజ్ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Hyundai Creta: ఆగస్టు 2023లో 13,832 యూనిట్ల క్రెటా అమ్ముడయ్యాయి. దీంతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగాయి.
Maruti Grand Vitara: గ్రాండ్ విటారా రెండో స్థానంలో ఉంది. మారుతీ సుజుకీ గతేడాది అక్టోబర్‌లో గ్రాండ్ విటారాను విడుదల చేసింది. బాగా అమ్ముడవుతోంది. దీని 11,818 యూనిట్లు ఆగస్టు 2023లో అమ్ముడయ్యాయి.
Kia Seltos: ఈ ఏడాది ఆగస్టులో కియా 10,698 యూనిట్ల సెల్టోలను విక్రయించింది. దీని అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 24% పెరిగాయి. మూడో స్థానంలో కొనసాగింది. ఇటీవలే దీని ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అయింది.
Mahindra Scorpio: మహీంద్రా గత సంవత్సరం స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్‌లను విడుదల చేసింది. ఇప్పుడు అవి బాగా అమ్ముడవుతున్నాయి. ఈ రెండింటిలో మొత్తం 9,898 యూనిట్లు ఆగస్టు 2023లో విక్రయించబడ్డాయి. నాలుగో స్థానంలో కొనసాగింది.
Mahindra XUV700: మహీంద్రా XUV700 జాబితాలో ఐదవ స్థానంలో కొనసాగింది. ఆగస్టులో దీని మొత్తం విక్రయాలు 6,512 యూనిట్లుగా ఉన్నాయి. SUV అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 8% పెరిగాయి.