Car Mileage Tips: కారు మైలేజ్‌ రావాలంటే ఈ చిట్కాలు పాటించండి.. ఫలితం మీకే తెలుస్తుంది..!

Car Mileage Tips: కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది కారు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

Update: 2023-07-29 07:11 GMT

Car Mileage Tips: కారు మైలేజ్‌ రావాలంటే ఈ చిట్కాలు పాటించండి.. ఫలితం మీకే తెలుస్తుంది..!

Car Mileage Tips: కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది కారు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ఇంధన ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటువంటి సందర్భంలో కారు మైలేజ్‌ పెంచుకోవడం చాలా అవసరం. లేదంటే కారు మెయింటనెన్స్‌కి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కారు మైలేజ్ బాగుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలని పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

కారు సర్వీస్‌

కారును సమయానికి సర్వీసింగ్‌ చేయడం ముఖ్యం. దీనివల్ల ఇంజిన్‌కు మాత్రమే కాదు బ్రేకులు, సస్పెన్షన్, ఇతర భాగాలతో సహా మొత్తం కారుకు ప్రయోజనం చేకూరుతుంది. కారు బాగా పని చేస్తుంది మైలేజ్ కూడా మెరుగవుతుంది.

స్మూత్ డ్రైవింగ్‌

డ్రైవింగ్‌ అనేది స్మూత్‌గా ఉండాలి. ఇది డ్రైవర్‌ని బట్టి ఉంటుంది. తరచుగా బ్రేక్‌లు వేయడం నివారించాలి. యాక్సిలరేటర్ పెడల్‌ను గట్టిగా నొక్కవద్దు. కారును స్థిరమైన వేగంతో నడిపేందుకు ప్రయత్నించాలి. అవసరమైనప్పుడు మాత్రమే బ్రేకులు వేయాలి. దీనివల్ల మంచి మైలేజ్‌ వస్తుంది.

టైర్ ప్రెజర్

టైర్ ఒత్తిడిని ఎప్పటికప్పుడు చెక్‌ చేయాలి. టైర్లలో గాలి సమానంగా ఉండాలి. గాలి పీడనం తక్కువగా ఉంటే అది మైలేజీపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే టైర్‌లో సరైన ప్రెజర్ ఉండేలా చూసుకోవాలి.

కిటికీలు తెరిచి ఉంచవద్దు

కిటికీలు తెరిచి కారును నడిపితే ఇంజిన్‌పై ఒత్తిడి, ఇంధన వినియోగం రెండు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో మీకు మంచి మైలేజీ రావాలంటే కారు కిటికీలు మూసి ఉంచాలి. ఇది ఇంజిన్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది ఇంధన వినియోగం కూడా తగ్గిస్తుంది.

ఓవర్‌లోడింగ్‌ను నివారించాలి

కారును ఓవర్‌లోడ్ చేసినప్పుడు మూ చేయడానికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి అది ఇంజిన్‌పై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల ఎక్కువ ఇంధనం కాలిపోతుంది. ఇది మైలేజీని తగ్గిస్తుంది. అందువల్ల ఓవర్‌లోడింగ్‌ను నివారించడం బెస్ట్‌.

Tags:    

Similar News