Bike Mileage Tips: బైక్ మైలేజీ కోసం వారానికి ఒకసారి ఇలా చేయండి.. ఇంధనం సేవ్ అవుతుంది..!
Bike Mileage Tips: రవాణ విషయంలో భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించేది బైక్ మాత్రమే. ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి వాళ్లే ఉంటారు.
Bike Mileage Tips: రవాణ విషయంలో భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించేది బైక్ మాత్రమే. ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి వాళ్లే ఉంటారు. వీరు వారి ఆర్థిక స్థోమతను బట్టి చిన్నదో పెద్దదో ఒక బైక్ మెయింటెన్ చేస్తారు. అయితే చాలామంది బైక్‌ను పట్టించుకోకుండా నడపడం వల్ల మైలేజీ దెబ్బతింటుంది. దీనివల్ల తరచూ ఇంధనం నింపాల్సి ఉంటుంది. అందుకే బైక్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. బైక్ చైన్‌ను వారానికి ఒకసారి క్లీన్ చేస్తే బైక్ మంచి మైలేజీ ఇస్తుంది. అంతేకాకుండా ఇంధనం కూడా తక్కువగా వినియోగిస్తుంది. దీనివల్ల ఎంతో కొంత ఆదా అవుతుంది.
బైక్ చైన్ స్నాకెట్ ఎలా క్లీన్ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.
రోజువారీ జీవితంలో మీకు సమయం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా బైక్ చైన్‌ని చెక్ చేయండి. దీని కోసం బైక్‌ను ఫ్లాట్ ప్లేస్‌లో డబుల్ స్టాండ్‌లో పార్క్ చేయాలి. టైర్లని తిప్పడం వల్ల చైన్ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఇందులో ఏదైనా సమస్య ఉంటే దానిని సులభంగా తెలుసుకోవచ్చు. బైక్ చైన్‌పై ధూళి కనిపిస్తే శుభ్రం చేయడానికి మంచి క్లీనర్ లేదా డిటర్జెంట్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. శుభ్రం చేయడానికి బ్రష్‌ని ఉపయోగించడం మంచిది. దీని ద్వారా పేరుకుపోయిన మట్టి మొదలైనవాటిని సరిగ్గా శుభ్రం చేయగలుగుతారు.
చాలా సార్లు మెకానిక్ బైక్ సర్వీసింగ్ అయిపోయిన వెంటనే గొలుసుపై ఆయిల్ వేస్తాడు. ఇది చాలా తప్పు. చైన్ నుంచి నీరు పూర్తిగా తొలగించిన తర్వాత మాత్రమే దానిపై ఆయిల్ వేయాలి. టైర్‌ను నెమ్మదిగా తిప్పుతూ చైన్‌పై ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత ఇది మొత్తం చైన్‌పై అప్లై అవుతుంది. దీనివల్ల చక్రాలు ఎటువంటి ఇబ్బందిలేకుండా ఫ్రీగా తిరుగుతాయి. బైక్ స్పీడ్, మైలేజీ రెండు పెరుగుతాయి.