Car Insurance: కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఇబ్బందులు.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!
Car Insurance: ఈ రోజుల్లో ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం.
Car Insurance: ఈ రోజుల్లో ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. లేదంటే వాహనదారులు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కారులాంటి వాహనాలకి ఇది చాలా అవసరం. కారు ఇన్సూరెన్స్ తీసుకోవడం సులభమే కానీ దానిని క్లెయిమ్ చేసే విషయంలో చాలా నిబంధనలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాహనదారులు ఏదేని సందర్భంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ముందు సరైన సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి అందించాలి. లేదంటే బీమా క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం చాలా మందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. అయితే క్లెయిమ్ ఫారమ్ నింపే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
FIR నమోదు చేయండి
కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ముందు పోలీసుస్టేషన్‌లో FIR నమోదు చేయాలి. కారుకు ఎంత నష్టం జరిగినా FIR నమోదు చేయడం వల్ల మీ దావా నిర్ధారిస్తారు. అదే సమయంలో చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైన సాక్ష్యాలను సేకరిస్తారు. కొన్ని బీమా కంపెనీలు కారు ప్రమాదం, దొంగతనం, ప్రాణనష్టం, ఆస్తి నష్టం మొదలైన వాటిపై ఎఫ్‌ఐఆర్‌ని డిమాండ్ చేస్తాయి.
కంపెనీకి అవసరమైన సమాచారాన్ని అందించండి
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు బీమా కంపెనీకి సరైన సమాచారాన్ని అందించడం అవసరం. ఏదైనా సమాచారాన్ని దాచినట్లయితే తర్వాత తిరస్కరణను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల క్లెయిమ్ ఫారమ్‌తో పాటు బీమా పాలసీ పత్రాలు, కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్, ఎఫ్‌ఐఆర్ కాపీని జత చేయాలి.
క్లెయిమ్ ఫారమ్‌ను సరిగ్గా నింపాలి
క్లెయిమ్ ఫారంలో సరైన సమాచారాన్ని అందించాలి. ఫారమ్‌లో ఎలాంటి తప్పులు ఉండకూడదు. ముఖ్యంగా స్పెల్లింగ్ లేదా టైపింగ్‌లో తప్పులు ఉండకూడదు. పేరు, పాలసీ నంబర్, కారు రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
బీమా పాలసీ నిబంధనలు, షరతులు చదవాలి
కారు బీమా పాలసీ నిబంధనలు, షరతులను చదవడం మర్చిపోవద్దు. పాలసీకి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా చదవడం వల్ల కవరేజ్, క్లెయిమ్ ప్రక్రియ గురించి సమాచారాన్ని పొందుతారు. ఇది అనవసర సమస్యలను నివారించడానికి సహాయం చేస్తుంది. క్లెయిమ్ ప్రాసెస్ గురించి సమాచారాన్ని అందించడమే కాకుండా దానిలో ఏమి చేర్చాలి ఏది చేయకూడదో తెలుస్తుంది.
భీమాను పునరుద్ధరించండి
ఇన్సూరెన్స్ కవరేజ్ నిరంతర ప్రయోజనాలను ఆస్వాదించడానికి కారు బీమాను పునరుద్ధరించడం అవసరం. పాలసీ కవరేజీని పొందడానికి బీమా గడువు ముగిసే ఒక రోజు ముందు పాలసీని పునరుద్ధరించడం అవసరం. ఇలా చేస్తే మీరు సురక్షితంగా ఉంటారు. సులభంగా క్లెయిమ్ పొందుతారు.