Bajaj Chetak 2903 Launched: బజాజ్ చేతక్ కొత్త వేరియంట్ చూశారా? ఇప్పుడు చాలా చవకగా మారింది..!
Bajaj Chetak 2903 Launched: బజాజ్ చేతక్ 2903ని త్వరలో లాంచ్ చేయనుంది. దీన్ని బడ్జెట్ ప్రైస్‌లో తీసుకురానున్నారు.
Bajaj Chetak 2903 Launched: టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ బజాజ్ ఆటో జులై సేల్స్ రిపోర్ట్ వెల్లడించింది. బజాజ్ పల్సర్ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. పల్సర్ వార్షిక ప్రాతిపదికన దాదాపు 9 శాతం వృద్ధిని సాధించింది. అయితే దాని ఫోర్ట్‌పోలియోలో చేతక్ ఎలక్ట్రిక్ 344 శాతం వృద్ధిని సాధించింది. సేల్స్ పరంగా చేతక్ కంపెనీ అన్ని మోడల్స్‌ను క్రాస్ చేసింది. ఇప్పుడు కంపెనీ చేతక్ లైనప్‌లో కొత్త వేరియంట్ Bajaj Chetak 2903ని తీసుకురానుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bajaj Chetak 2903 Features
చేతక్ 2903 దాని ముందు వేరియంట్ 2901 కంటే అప్‌గ్రేడ్ ఫీచర్లతో రావచ్చు. ఎందుకంటే 2901, అర్బన్ వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 తేడా ఉంటుంది. ఎందుకంటే కంపెనీ దాని ధర ప్రకారం మరిన్ని ఫీచర్లను అందిస్తుంది. అయితే దీని డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ కొత్త కలర్స్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.
చేతక్ 2901 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. దాని సహాయంతో మీరు స్మార్ట్‌ఫోన్ అలర్ట్స్ చూడొచ్చు. ఇందులో హిల్ హోల్డ్, రివర్స్, స్పోర్ట్ అండ్ ఎకానమీ మోడ్, కాల్, మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ లైట్లు, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్‌లను అందించే టెక్‌ప్యాక్‌ని కూడా మీరు ఇందులో పొందవచ్చు. ఇది రెడ్, వైట్, బ్లాక్, ఎల్లో, లెమన్, బ్లూ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది.
Bajaj Chetak 2903 Battery
చేతక్ 2903 అదే 2.9kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో ARAIసర్టిఫికేషన్ ప్రకారం 123km రేంజ్ ఇస్తుంది. అయితే దాని గ్లోబల్ రేంజ్ దాదాపు 90 నుండి 100 కి.మీ. స్కూటర్‌లో 4kw ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కిమీ. అయితే 2901 వేరియంట్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ లేదు. ఈ ఫీచర్లను చేతక్ 2903లో అందించవచ్చని భావిస్తున్నారు. కొత్త చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.2 లక్షలుగా ఉండవచ్చు. రాబోయే కొద్ది వారాల్లో దీనిని ప్రారంభించవచ్చు.