Bajaj Freedom 125: ఈ క్రేజ్ ఏంటి సామి.. కొనేందుకు ఎగబడుతున్నారు.. ఎందుకంటారు..?

Bajaj Freedom 125: బజాజ్ ఫ్రీడమ్ 125ని జూలై నెలలో 1900 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు కొనుగోలు చేశారు. దీని బేస్ మోడల్ ధర రూ. 95 వేలు.

Update: 2024-08-25 12:38 GMT

Bajaj Freedom 125

Bajaj freedom 125: ప్రపంచంలోని మొట్టమొదటి CNG బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 విక్రయాలు దేశంలోని 78 నగరాల్లో ప్రారంభమయ్యాయి. మొదటగా జూలై 16న పూణేలో డెలివరీ ప్రారంభించినప్పటి నుండి జూలై నెలలో 1900 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లకు కంపెనీ వీటిని డెలివరీ చేసింది. లాంచ్ అయిన మొదటి నెలలోనే దాదాపు రెండు వేల యూనిట్ల బజాజ్ CNG బైకులు అమ్ముడయ్యాయి. జూలై 16న పూణేలో డెలివరీ ప్రారంభించిన తర్వాత 15 రోజుల్లో 1,933 యూనిట్లు డెలివరీ అయ్యాయి. ఇప్పటి వరకు 60 వేలకు పైగా ఎంక్వేరీలు వచ్చాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గత జూలైలో బజాజ్ ఆటో లిమిటెడ్ దేశం, ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125ని విడుదల చేసింది. ఈ బైక్‌పై అకస్మాత్తుగా ప్రజల్లో హైప్ క్రియేట్ అయింది. డెలివరీ ప్రారంభమైన మొదటి 15 రోజుల్లో 1,933 యూనిట్లు డెలివరీ అయ్యాయి. అప్పుడు లిమిటెడ్ ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కంపెనీ ఆగస్టు 15 వరకు దేశంలోని 78 నగరాల్లో బజాజ్ ఫ్రీడమ్ 125 విక్రయాలను ప్రారంభించింది.రాబోయే కాలంలో CNG బైక్‌లను ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్నారో అమ్మకాల గణాంకాలు వెల్లడిస్తాయి. 

బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ డిజైన్ భిన్నంగా ఉంటుంది. ఛాసిస్ చాలా బలంగా ఉంది. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కాంపాక్ట్, తేలికపాటి బైక్. ఇందులో స్పోర్టి ఫ్యూయల్ ట్యాంక్, పెద్ద, సౌకర్యవంతమైన సీటు, బలమైన గ్రాబ్ రైల్, సీటు కింద రెండు కిలోల CNG ట్యాంక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి

బజాజ్ ఫ్రీడమ్ 125 124.5 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 10.9 bhp పవర్, 11 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ CNG బైక్ 2 లీటర్ పెట్రోల్ ఇంధన ట్యాంక్, 2 కిలోల CNG ట్యాంక్‌తో కలిపి 330 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇది మొత్తం 3 వేరియంట్‌‌లలో వస్తుంది. అవి NG04 డ్రమ్, NG04 డ్రమ్ LED, NG04 డిస్క్ LED. ఫ్రీడమ్ 125 కరేబియన్ బ్లూ, ప్యూటర్ గ్రే బ్లాక్, సైబర్ వైట్, ఎబోనీ బ్లాక్ గ్రే, రేసింగ్ రెడ్, ప్యూటర్ గ్రే ఎల్లో, ఎబోనీ బ్లాక్ రెడ్ వంటి కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. ధర గురించి మాట్లాడితే దీని బేస్ మోడల్ ధర రూ. 95 వేలు, మిడ్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ. 1.10 లక్షలు.

Tags:    

Similar News