CNG Bike: దేశంలోనే తొలి CNG బైక్ వచ్చేస్తోంది.. కేక పుట్టించే ఫీచర్లు, కళ్లు చెదిరే డిజైన్.. లాంఛ్ ఎప్పుడంటే?
బైక్ ఎలా ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే, పలు నివేదికల మేరకు, ఈ బైక్ 110-150 సీసీ ఇంజన్‌లో రావచ్చని చెబుతున్నారు. ఈ బైక్ హైబ్రిడ్ శైలిని అనుసరించే అవకాశం కూడా ఉంది.
Bajaj CNG Bike: భారత రోడ్లపై పరుగులు తీస్తున్న CMG బైక్‌లను మీరు త్వరలో చూడనున్నారు. బజాజ్ దేశంలోనే తొలి CNG బైక్‌ను విడుదల చేయనుంది. ఈసారి కూడా బజాజ్ తన వారసత్వాన్ని కొనసాగించింది. వాస్తవానికి, 25 సంవత్సరాల క్రితం కూడా, బజాజ్ దేశంలో మొదటిసారిగా CNG ఆటోను విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి బజాజ్ మొబిలిటీ రంగంలో విభిన్నంగా రాబోతోంది. బజాజ్ CNG బైక్ వచ్చే నెలలో భారతదేశంలో విడుదల కానుంది.
దీని లాంచ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. బజాజ్ CNG బైక్ జులై 5, 2024న భారతదేశంలో విడుదల కానుంది. బజాజ్ చాలా కాలంగా సీఎన్‌జీ బైక్‌లపై పనిచేస్తుండటం గమనార్హం. ట్రయల్స్‌లో చాలాసార్లు సీఎన్‌జీ బైక్‌లు రోడ్లపై కనిపించాయి. వచ్చే నెలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ బైక్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
అంచనాలు ఏమిటి?
బైక్ ఎలా ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే, పలు నివేదికల మేరకు, ఈ బైక్ 110-150 సీసీ ఇంజన్‌లో రావచ్చని చెబుతున్నారు. ఈ బైక్ హైబ్రిడ్ శైలిని అనుసరించే అవకాశం కూడా ఉంది. అంటే, అవసరమైతే పెట్రోలుకు కూడా మార్చుకోవచ్చు. CNG అయిపోతే బైక్ నడపడానికి ఒక చిన్న ట్యాంక్ పెట్రోల్ కూడా ఇవ్వవచ్చు అని తెలుస్తోంది.
టెస్ట్ మోటార్‌సైకిల్‌లో అనేక సాధారణ బైక్ ఫీచర్లు కనిపించాయి. ఉదాహరణకు, టెలిస్కోప్ ఫోర్కులు, సూచికలు, మోనోషాక్ యూనిట్, అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ సీటు, డిస్క్, డ్రమ్ బ్రేక్‌ల మిశ్రమం మొదలైనవి కనిపించాయి.