Bajaj Pulsar N125 Launched: పల్సర్ N125 కొత్త మోడల్ వచ్చేస్తోంది.. ధర తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే..!
Bajaj Pulsar N125 Launched: బజాజ్ ఆటో తన అత్యధికంగా అమ్ముడైన పల్సర్ N125 కొత్త మోడల్‌ను రేపు అంటే అక్టోబర్ 17న విడుదల చేయనుంది.
Bajaj Pulsar N125 Launched: బజాజ్ ఆటో తన అత్యధికంగా అమ్ముడైన పల్సర్ N125 కొత్త మోడల్‌ను రేపు అంటే అక్టోబర్ 17న విడుదల చేయనుంది. అక్టోబర్ 16న లాంచ్ కానుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ ఇప్పుడు తన కొత్త తేదీని అక్టోబర్ 17గా ప్రకటించింది. కంపెనీ ముందుగా పంపిన ఆహ్వానాల్లో 'ఆల్-న్యూ పల్సర్' అని రాసి ఉంది. కంపెనీ ఆహ్వానంలో మోడల్‌ను పేర్కొనలేదు. అయితే ఇది పల్సర్ N125 అని చెబుతున్నారు.
బజాజ్ ఈ కొత్త మోటార్‌సైకిల్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. రాబోయే పల్సర్ 'ఫన్, ఎజైల్, అర్బన్'గా ఉంటుందని కంపెనీ లాంచ్ ఇన్వైట్ వెల్లడించింది. 'అర్బన్' అనే పదం అంటే కొత్త పల్సర్ N125 స్పోర్టీ, యూత్‌ఫుల్ స్టైలింగ్‌తో ప్రీమియం కమ్యూటర్ కావచ్చు. బైక్‌లో స్ప్లిట్ సీట్, టూ-పీస్ గ్రాబ్ రైల్ ఉంటుందని చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.
కొత్త పల్సర్ N125 కూడా ప్రస్తుతం ఉన్న పల్సర్ 125 వలె అదే 125cc, సింగిల్ సిలిండర్ మోటార్‌ను పొందుతుంది. అయితే బైక్‌కు స్పోర్టీ క్యారెక్టర్‌ని ఇచ్చేలా ఇంజన్‌లో మార్పులు చేయచ్చు. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. బజాజ్ పల్సర్ N125 TVS రైడర్ 125, Hero Xtreme 125R లకు పోటీగా ఉంటుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.90,000 నుండి రూ.1 లక్ష వరకు ఉండవచ్చు.
దీని బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉండచ్చు. బజాజ్ సింగిల్-ఛానల్ ABSతో వెనుక డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను పరిచయం చేయవచ్చని నమ్ముతారు. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ కోసం అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల గురించి మాట్లాడితే స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో డిజిటల్ కన్సోల్‌ను ఇందులో చూడవచ్చు.