Car Care Tips: కారులో లాంగ్‌ డ్రైవ్‌ వెళుతున్నారా.. ఈ విషయం అస్సలు మరిచిపోవద్దు..!

Car Care Tips: కొంతమందికి కారులో లాంగ్‌ డ్రైవ్ వెళ్లడమంటే చాలా సరదాగా ఉంటుంది. కనీసం వారానికి ఒక్కసారైన లాంగ్‌ ట్రిప్‌ వెళుతుంటారు.

Update: 2023-09-19 11:51 GMT

Car Care Tips: కారులో లాంగ్‌ డ్రైవ్‌ వెళుతున్నారా.. ఈ విషయం అస్సలు మరిచిపోవద్దు..!

Car Care Tips: కొంతమందికి కారులో లాంగ్‌ డ్రైవ్ వెళ్లడమంటే చాలా సరదాగా ఉంటుంది. కనీసం వారానికి ఒక్కసారైన లాంగ్‌ ట్రిప్‌ వెళుతుంటారు. అయితే ఇది మంచిదే కానీ కారు కండీషన్‌ కూడా చూసుకోవాలి. లేదంటే సమస్యల్లో పడుతారు. కారు స్టెప్నీ టైర్ చాలా ముఖ్యమైనది. ఒకవేళ కారు టైర్‌ పంక్చర్ అయితే దాని స్థానంలో స్టెప్నీ ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు కుటుంబంతో ఎక్కడికైనా వెళుతున్నప్పుడు టైర్ పంక్చర్ అవుతుంది. ఆ సమయంలో వాహనంలో స్టెప్నీ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అయితే స్టెప్నీ టైర్‌ కూడా ఎలా ఉండాలో ఎలా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం.

స్టెప్నీ టైర్

1. స్టెప్నీ టైర్లను క్రమం తప్పకుండా చెక్‌ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని రోజులకి అవి గాలిని కోల్పోతాయి. కాబట్టి స్టెప్నీ టైర్ మంచి స్థితిలో ఉందా లేదా తగినంత గాలి ఉందా లేదా అని కచ్చితంగా గమనించాలి.

2. స్టెప్నీకి ఉపయోగించే టైర్ బాగుండాలి. స్టెప్నీ కోసం పాత అరిగిపోయిన టైర్‌ను కారులో ఉంచకూడదు. స్టెప్నీకి మంచి టైర్‌ మెయింటెన్ చేయాలి. లేదంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

3. కొన్ని కార్లలో స్టెప్నీ టైర్ సాధారణ టైర్ కంటే చిన్నదిగా ఉంటుంది. ఈ టైర్లను ఎక్కువగా ఉపయోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కొంత దూరం వరకు తక్కువ వేగంతో ఉపపయోగించాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి.

4. స్టెప్నీ టైర్‌ను దాని స్థానంలో సరిగ్గా అమర్చాలి. టైర్‌ను వదులుగా అమర్చినట్లయితే అది శబ్దం చేస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

Tags:    

Similar News