Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు
Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు
30-06-2024 (ఆదివారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి : నవమి మధ్యాహ్నం గం.12.19 ని.ల వరకు ఆ తర్వాత దశమి
నక్షత్రం: రేవతి ఉదయం గం.7.34 ని.ల వరకు ఆ తర్వాత అశ్వని
అమృతఘడియలు: రాత్రి గం.11.34 ని.ల నుంచి అర్ధరాత్రి గం.1.06 ని.ల వరకు
వర్జ్యం: ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.2.37 ని.ల నుంచి గం.4.03 ని.ల వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం గం.5.09 ని.ల నుంచి గం.6.02 ని.ల వరకు
రాహుకాలం : సాయత్రం గం.5.16 ని.ల నుంచి గం.6.55 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా.గం.5.45 ని.లకు
సూర్యాస్తమయం : సా.గం.6.55 ని.లకు
మేషం :
శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైన కాలం. విద్యార్థుల కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ కృషికి ప్రశంసలు అందుతాయి. వాహన యోగం ఉంది.
వృషభం :
ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనూహ్యమైన ఖర్చులొస్తాయి. బంధువులతో విరోధం గోచరిస్తోంది.. మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. బద్ధకాన్ని వదిలి శ్రమించాలి.
మిథునం :
యోగదాయకంగా ఉంటుంది. ఆకాంక్షలు నెరవేరతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ప్రశంసలొస్తాయి. సంతాన సంబంధ శుభవార్త వింటారు. ఆరోగ్యం బావుంటుంది. శత్రుపీడ తొలగుతుంది.
కర్కాటకం:
చక్కటి అవకాశం అందివస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగుల కార్యదక్షతకు ప్రశంసలు అందుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
సింహం :
పనులు అనుకున్నట్లుగా జరగవు. స్వజనంతోనే విరోధం గోచరిస్తోంది. డబ్బులు బాగా ఖర్చవుతాయి. శత్రువులు పెరుగుతారు. ఉదర సంబంధ సమస్యలుంటాయి. సంతానం తీరు కలవర పరుస్తుంది.
కన్య :
అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. అధికారుల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. కొన్ని పనులను అయిష్టంగా చేయాల్సి వస్తుంది. అపోహలను, కోపాన్ని తగ్గించుకోవాలి. అజీర్తి సమస్య విసిగిస్తుంది.
తుల :
అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. బంధువులను కలుస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది.
వృశ్చికం :
రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. కృషికి తగ్గ ఫలితాన్ని, ప్రశంసలను పొందుతారు. అవసరానికి బంధువుల సహకారం అందుతుంది. శత్రుపీడ తొలగుతుంది. ఆరోగ్యంగా బావుంటుంది. కొత్త వస్తువులను కొంటారు.
ధనుస్సు :
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సూచనలను పాటించండి. సంతానం తీరు చికాకు పరుస్తుంది. అనూహ్యమైన ఖర్చులొస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. వాత సంబంధ సమస్యలు ఉంటాయి.
మకరం :
ఆర్థిక లావాదేవీల్లో జాప్యం ఏర్పడుతుంది. కార్యసాధనలోనూ అడ్డంకులు నష్టాలు ఉంటాయి. మనసు నిలకడగా ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కుంభం :
అన్ని వైపులా శుభాలే ఉంటాయి. శారీరక, మానసిక సౌఖ్యం లభిస్తుంది. ఆర్థిక పరమైన చికాకులు తొలగుతాయి. ప్రియతములను కలుస్తారు. కీలక సమాచారం అందుతుంది. సోదరులు తోడుగా ఉంటారు.
మీనం :
అనుకోని చికాకులొస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగవు. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.