Horoscope Today: ఈ రాశి వారికి విపరీతమైన ఖర్చులు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Horoscope Today 2nd July 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Update: 2024-07-02 00:30 GMT

Horoscope Today: ఈ రాశి వారికి విపరీతమైన ఖర్చులు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

02-07-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి : ఏకాదశి ఉ.గం.8.42 ని.ల వరకు తర్వాత ద్వాదశి

నక్షత్రం: కృత్తిక రేపు తె.వా. గం. 4.40 ని.ల వరకు తర్వాత రోహిణి

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటాక గం.2.20 ని. లనుంచి గం.3.53 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.5.03 ని.ల నుంచి గం.6.36 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.24 ని.ల నుంచి గం.9.16 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.15 ని.ల నుంచి గం.11.59 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.38 ని.ల నుంచి గం.5.16 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా.గం.5.46 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం.6.55 ని.లకు


మేషం :

అన్ని వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. డబ్బు లావాదేవీలు ఆశించినట్లుగా సాగవు. అనవసర నిందలు వస్తాయి. ఇంట్లోనూ మనశ్శాంతి ఉండదు. తగాదాలకు దూరంగా ఉండండి. లక్ష్మీనృసింహుణ్ణి పూజించండి. 


 వృషభం :

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి.అన్ని రంగాల్లోని వారికీ ప్రశంసలొస్తాయి. వృథా ఖర్చులు తగ్గించాలి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇతరులను చులకనగా చూడకండి.


 మిథునం :

వ్యవహారాలు సవ్యంగా సాగవు. బంధువులే విరోధులవుతారు. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. వేళకు భోజనం ఉండదు. మానసిక దిగులు ఆవరిస్తుంది. బద్ధకం వదలండి. మిత్రులతో సఖ్యత చెడనీయకండి.


 కర్కాటకం:

వృత్తి ఉద్యోగాల్లోని వారికి అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో ఉంటాయి. సంతానం వృద్ధిని ఆనందిస్తారు. రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది. ఇతరుల తోడ్పాటు లభిస్తుంది. స్నేహాలుపెరుగుతాయి.


 సింహం :

బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తుల పనితీరుకు రివార్డులు అందుతాయి. మేలిమి అవకాశాలు అందివస్తాయి. శత్రుపీడ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.


కన్య :

పనులు అనుకున్నట్లుగా జరగవు. వృత్తులోని వారికి కాస్త ప్రతికూలంగా ఉంటుంది. స్థిరచిత్తంతో కార్యాలు సాధించుకోవాలి. ఉన్నత విద్యా వ్యవహారాల్లో ఆటంకాలు ఉంటాయి. పరిణామాలు అశాంతిని కలిగిస్తాయి.


 తుల :

అనుకున్న సమయానికి పనులు కావు. గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.


 వృశ్చికం :

అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు నెరవేరతాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. బంధాలు బలపడతాయి. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు ఉపకరిస్తాయి. కీర్తి పెరుగుతుంది.


ధనుస్సు :

శుభ ఫలితాలను పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. రుణ సంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి. శత్రువుల పీడ తగ్గుతుంది. సమస్య పరిష్కారంలోబంధువులు సహకరిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది.


 మకరం :

ప్రతి పనిలో ఆటంకాలుంటాయి. కార్యసాధనలో శత్రుత్వాలు పెరుగుతాయి. ఆలోచనలు సవ్యంగా సాగవు. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే సూచన ఉంది. ఖర్చులు మితిమీరతాయి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి.


 కుంభం :

గృహ సంబంధ వ్యవహారాలు కలవర పెడతాయి. శత్రువుల దుష్ప్రచారంతో ప్రతిష్ట మసకబారుతుంది. కీలక సమాచారం అందుతుంది. అగ్రిమెంట్లకు అనుకూలం కాదు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి.


మీనం :

దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఫలితం దక్కుతుంది. వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. మిత్రులు అన్నివిధాలా తోడ్పడతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ప్రియతముల కలయిక విశేష ఆనందాన్నిస్తుంది.

Tags:    

Similar News