Horoscope Today: ఈ రాశివారికి వ్యవహారాలలో ఆటంకాలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఈ రాశివారికి వ్యవహారాలలో ఆటంకాలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Update: 2024-06-28 00:30 GMT

Horoscope Today: ఈ రాశివారికి వ్యవహారాలలో ఆటంకాలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

28-06-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్టమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి : సప్తమి సా. గం.4.27 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: పూర్వాభాద్ర ఉదయం గం.10.10 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాభాద్ర

అమృతఘడియలు: రేపు తె.వా. గం 4.17 ని.ల నుంచి గం. 5.48 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.7.14 ని.ల నుంచి గం.8.45 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.23 ని.ల నుంచి గం.9.15 ని.ల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.46 ని.ల నుంచి గం.1.39 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.41 ని.ల నుంచి గం.12.20 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా.గం.5.45 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం.6.54 ని.లకు


మేషం :

వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. మీ రహస్యాలు బహిర్గతమయ్యే సూచన ఉంది. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. వృథా ఖర్చులు చికాకు పెడతాయి. ఎడమ కంటికి సమస్య వస్తుంది. శనిని పూజించడం మేలు.  


వృషభం :

రోజంతా అభివృద్ధి దిశగా ఆనందంగా సాగుతుంది. సంతాన సంబంధ శుభవార్త వింటారు. సౌకర్యాలు సమకూరతాయి. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలుంటాయి. శుభకార్యాల నిర్వహణపై ఆలోచిస్తారు.


మిథునం :

స్థిరచిత్తంతో చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. గృహశాంతి ఉంటుంది.


కర్కాటకం:

ఉన్నత విద్య ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడతాయి. తండ్రితో సఖ్యత చెడుతుంది. ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు పెద్దగా లాభించవు. శ్రీ వేంకటేశ్వరుణ్ణి పూజించండి.


సింహం :

అపోహలు పెరుగుతాయి. ఆలోచనలు సవ్యంగా సాగవు. చెడుదారులు తొక్కే వీలుంది. అనుకున్న సౌకర్యాలు సమకూరవు. శారీరక శ్రమ పెరుగుతుంది. తగాదాలకు దిగొద్దు. కనకదుర్గమ్మను పూజించండి. 


కన్య :

ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి.


తుల :

కార్యజయం ఉంది. అభీష్టం నెరవేరుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తగ్గుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.


వృశ్చికం :

వ్యవహారాల్లో ఆటంకాలు మనోవ్యధకు కారణమవుతాయి. సొంత తెలివితేటలు పనిచేయవు. కీలక అంశాలపై ఆత్మీయులను సంప్రదించండి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి.


ధనుస్సు :

విద్యారంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. స్వజనులతోనే విరోధం గోచరిస్తోంది. వ్యవహారాల్లో జాగ్రత్త. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామిని పూజించండి.


మకరం :

అన్నివైపులా శుభాలే గోచరిస్తాయి. మిత్రులు, సోదరుల అండతో కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. మనశ్శాంతిని పొందుతారు. ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. 


కుంభం :

అనుకున్నవి జరగవు. ఎవరికీ పూచీగా ఉండకండి. మాట తప్పడం వల్ల నింద పడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సవ్యగా సాగవు. ఇంట్లోనూ స్వల్ప చికాకులుంటాయి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.


మీనం :

వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు ఆనందాన్నిస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గౌరవం వృద్ధి చెందుతుంది.

Tags:    

Similar News