Horoscope Today: ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Update: 2024-06-27 00:30 GMT

Horoscope Today: ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

27-06-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి : షష్ఠి సాయంత్రం గం.6.39 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి

నక్షత్రం: శతభిషం ఉదయం గం.11.36 ని.ల వరకు, ఆ తర్వాత పూర్వాభాద్ర

అమృతఘడియలు: ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.2.39 ని.ల నుంచి గం.4.09 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.5.38 ని.ల నుంచి గం.7.08 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.08 ని.ల నుంచి గం.11.00 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.24 ని.ల నుంచి గం.4.16 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.58 ని.ల నుంచి గం.3.37 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.44 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.54 ని.లకు


మేషం :

పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. వంశపారంపర్య ఆస్తుల వ్యవహారాల్లో కదలిక ఉంటుంది. ఆశలు వదిలేసిన సొత్తు తిరిగి లభించే సూచన ఉంది. మానసిక శాంతి కలుగుతుంది. స్నేహబంధాలు బలపడతాయి.


వృషభం :

కార్యజయం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంతో ముడిపడిన కార్యాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుతారు. తల్లితో అనుబంధం పెరుగుతుంది. దత్తత వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కీర్తి పెరుగుతుంది.


మిథునం :

అనుకున్నట్లుగా పనులు సాగవు. జీవిత భాగస్వామి సోదర వర్గం నుంచి చికాకులు వస్తాయి. ఆచారాల నుంచి పక్కకు మళ్లే సూచన ఉంది. దూర ప్రయాణాలు పెద్దగా లాభించవు. నవగ్రహారాధాన మేలు చేస్తుంది. 


కర్కాటకం:

అన్నింటికీ ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ప్రభుత్వానికి అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. తగాదాలకు దూరంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించడం మేలు. 


సింహం :

అభీష్టం నెరవేరుతుంది. తండ్రి సోదర వర్గం గురించి శుభవర్తమానం అందుతుంది. బంధువులను కలుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.


కన్య :

శుభ ఫలితాలను అందుకుంటారు. సేవారంగంలోని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనితీరుకు తగ్గ ప్రశంసలు పొందుతారు. ఆత్మీయుల సహకారాన్ని పొందుతారు. శత్రుపీడ బాగా తగ్గుతుంది.  


తుల :

ఆటంకాలు ఏర్పడినా కార్యదక్షతను కనబరుస్తారు. అనవసర విరోధాల్లో కూరుకుంటారు. ఆలోచనలు సవ్యంగా సాగవు. జీవిత భాగస్వామి వల్ల సౌభాగ్యం కలుగుతుంది. కీలక వస్తువులు భద్రంగా దాచుకోండి,. 


వృశ్చికం :

పనులు సవ్యంగా సాగవు. సంతానంతో సఖ్యత చెడుతుంది. విద్యారంగంలోని వారికి ఒడుదుడుకులు ఉంటాయి. ఉద్యోగులు చివాట్లు తినే సూచన ఉంది. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. గణపతి పూజ మేలు.


ధనుస్సు :

శుభప్రదంగా ఉంటుంది. రాజీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎదురు చూస్తున్న వర్తమానం అందుతుంది. ఆత్మీయుల సూచనలు ఉపకరిస్తాయి. మిత్రుల తోడ్పాటుతో వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.


మకరం :

ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు సవ్యంగా సాగక పోవడం ఆందోళనను పెంచుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. కుటుంబ చికాకుల నుంచి సాంత్వనకు దత్తాత్రేయుణ్ణి పూజించండి.


కుంభం :

ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల అభివృద్ధికి సంబంధించిన వర్తమానం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ప్రశంసలను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి.


మీనం :

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వస్తుంది. నిద్రలేమి వేధిస్తుంది. శత్రుపీడ పెరుగుతుంది. ప్రయాణాలు సత్ఫలితాలను ఇవ్వవు. ఇతరులతో జాగ్రత్తగా మెలగండి. బద్ధకాన్ని వదిలి కష్టపడితే అభీష్టం నెరవేరుతుంది.

Tags:    

Similar News