Horoscope Today, 24 June 2024: ఈ రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope (Rasi Phalalu) Today, 24 June 2024: ఈ రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే. 12 రాశుల వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు 24-06-2024 (సోమవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి : తదియ అర్ధరాత్రి గం.1.23 ని.ల వరకు ఆ తర్వాత చవితి
నక్షత్రం: ఉత్తరాషాఢ సాయంత్రం గం.3.54 ని.ల వరకు ఆ తర్వాత శ్రవణం
అమృతఘడియలు: ఉ.గం.9.48 ని.ల నుంచి గం. 11.20 ని.ల వరకు మళ్లీ రేపు తె.వా.గం.4.44 ని.ల నుంచి గం.6.14 ని.ల వరకు
వర్జ్యం: సా. గం.7.40 ని.ల నుంచి గం. 9.11 ని.ల వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.45 ని.ల నుంచి గం.1.38 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.23 ని.ల నుంచి గం.4.16 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.7.22 ని.ల నుంచి గం. 9.01 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం.5.44 ని.ల కు
సూర్యాస్తమయం : సా. గం. 6.54 ని.ల కు
మేషం :
రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. గృహశాంతి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. అభీష్టం సిద్ధిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు.
వృషభం :
అనుకున్న స్థాయిలో కాకపోయినా కార్యాల్లో స్వల్ప కదలిక ఉంటుంది. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మధ్యవర్తిత్వాలు చేయకండి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సాంత్వన కోసం శివుణ్ణి పూజించండి.
మిథునం :
పనులు నెమ్మదిస్తాయి. కలుషితాహారం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. అపోహలు పెరుగుతాయి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సౌకర్యాలు అనుకున్నట్లు సమకూరవు. దుర్గాదేవిని పూజించడం మేలు.
కర్కాటకం:
ప్రయత్నాలు సఫలం అవుతాయి. ధనలాభం ఉంది. బంధుత్వాలు, బంధాలు బలపడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు సజావుగా ఉంటాయి. బంధువులతో కలిసి విందుకు హాజరవుతారు. వాహనయోగం ఉంది.
సింహం :
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అప్పిచ్చిన వారి ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త వస్తువులు కొనే సూచన ఉంది. సంతానం సంబంధ శుభవార్తను వింటారు. పెద్దవారి ప్రశంసలు పొందుతారు.
కన్య :
కార్యసాధనలో అడ్డంకులుంటాయి. సొంత తెలివితేటలతో పాటు ఆత్మీయుల సూచనలను పాటించండి. వృథా ఖర్చులు మనోవ్యధకు కారణమవుతాయి. నిరాశను దూరం చేయండి. సూర్యారాధన మేలు చేస్తుంది.
తుల :
సొంత నిర్ణయాలు సత్ఫలితాలనివ్వవు. అశాంతికి కారణమవుతాయి. కార్యసాధనలో ఆత్మీయుల సహాయం తీసుకోండి. వృథాఖర్చులను తగ్గించుకోవాలి. విద్యార్థుల శ్రమకు ఫలితం ఉండదు. నవగ్రహారాధన మేలు.
వృశ్చికం :
అన్నింటా శుభ ఫలితాలే వస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాయాదుల సహకారం లభిస్తుంది. కీలక సమాచారం ఆనందాన్నిస్తుంది.
ధనుస్సు :
అనుకున్నవేవీ సవ్యంగా సాగవు. మనసుకి కష్టం కలుగుతుంది. కుటుంబ చికాకులుంటాయి. చెప్పుడు మాటలు వినకండి. ఇతరులను నిందించకండి. మితాహారమే తీసుకోండి. షణ్ముఖుడిని పూజించండి.
మకరం :
అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ప్రతి కార్యమూ జయప్రదం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కార్యదక్షతకు ప్రశంసలొస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. శారీరక, మానసిక సౌఖ్యం లభిస్తుంది.
కుంభం :
పనులు సవ్యంగా సాగవు. అనవసర వివాదాలు చుట్టుముడతాయి. ఉద్యోగస్తులు నిజాయితీని నిరూపించుకోవాల్సి వస్తుంది. భోజనం సహించదు. సాంత్వనకు ఆంజనేయ స్వామిని పూజించండి.
మీనం :
ఆనందంగా గడుపుతారు. ఇష్టులతో విందుల్లో పాల్గొంటారు. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. ఇతరులూ సహకరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.