Horoscope Today: ఈ రాశి వారికి మిత్రులే శత్రువులయ్యే సూచన.. 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు
Horoscope Today: ఈ రాశి వారికి మిత్రులే శత్రువులయ్యే సూచన.. 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు
23-06-2024 (ఆదివారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి : విదియ రేపు తె.వా. గం.3.25 ని.ల వరకు ఆతర్వాత తదియ
నక్షత్రం: పూర్వాషాడ సా. గం.5.03 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.12.26 ని.ల నుంచి గం. 1.58 ని.ల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి గం.12.40 ని.ల నుంచి గం.2.12ని.ల వరకు
దుర్ముహూర్తం : సా. గం.5.08 ని.ల నుంచి గం.6.01 ని.ల వరకు
రాహుకాలం : సా. గం.5.15 ని.ల నుంచి 6.54 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం.5.43 ని.లకు
సూర్యాస్తమయం : సా.గం.6.54 ని.లకు
మేషం :
అప్రమత్తంగా ఉండండి. ఆత్మీయులతోనే విరోధం గోచరిస్తోంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఉదర సంబంధ సమస్యలుంటాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పూజించండి.
వృషభం :
ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. పెద్దవాళ్ల కోపానికి గురవుతారు. మనశ్శాంతి కరువవుతుంది. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. చెడు ఆలోచనలను కట్టడి చేయండి. దుర్గాదేవిని పూజించండి.
మిథునం :
ఉత్సాహంగా గడుపుతారు. బంధాలు బలపడతాయి. శారీరక, మానసిక సుఖం లభిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు తృప్తినిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.
కర్కాటకం:
కార్యాలు విజయవంతం అవుతాయి. దీక్షాదక్షతలకు గుర్తింపు లభిస్తుంది. పెద్దవారి నుంచి ప్రశంసలను పొందుతారు. కీలక వ్యవహారంలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
సింహం :
వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. నిరాశ చెందకండి. సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచనలను అదుపు చేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి. వృథాఖర్చులు ఉంటాయి. ఆంజనేయుణ్ణి పూజించండి.
కన్య :
ఖర్చులు అమితంగా ఉంటాయి. ఆస్తికి సంబంధించిన చికాకులుంటాయి. అవమానాలు గోచరిస్తున్నాయి. మానసిక అశాంతికి ఆస్కారం ఉంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.
తుల :
ఆనందంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలు మనసుకు హాయినిస్తాయి. ఆత్మీయులను కలుస్తారు. అవసరమైన సమాచారం అందుతుంది. దగ్గరి ప్రయాణాలు శుభప్రదం అవుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
వృశ్చికం :
అనుకున్నవి జరగవు. ఇతరుల వల్ల సమస్యలు వస్తాయి. అకారణ విరోధాలు తలెత్తుతాయి. మానసిక అశాంతికి కారణమవుతుంది. ఇంట్లో చికాకులుంటాయి. సాంత్వన కోసం సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.
ధనుస్సు :
బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అనుకున్న కార్యాలు నెరవేరతాయి. పెద్దల ప్రశంసలను పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీలకమైన బాధ్యతను స్వీకరిస్తారు. విందుల్లో పాల్గొంటారు.
మకరం :
కార్యవైఫల్యం విచారాన్ని కలిగిస్తుంది. బద్ధకాన్ని వదిలించుకుని కష్టపడితే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. తొందరపాటు నిర్ణయాలు గౌరవాన్ని తగ్గిస్తాయి. మిత్రవిరోధం సూచిస్తోంది జాగ్రత్త. గౌరీదేవిని పూజించండి.
కుంభం :
అన్నీ అనుకున్నట్లే సాగుతాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతను పొందుతారు.
మీనం :
ప్రయత్నించిన పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇతరులతో విరోధం ఏర్పడినా మీకే విజయం దక్కుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. గౌరవ వృద్ధి ఉంది.