రాశిఫలాలు 21 జూన్ 2024: ఆ రాశి వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today, దిన ఫలాలు (21 జూన్ 2024): మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.
21-06-2024 (శుక్రవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం
తిధి : చతుర్దశి ఉదయం గం.7.31. ని.ల వరకు ఆ తర్వాత పౌర్ణమి
నక్షత్రం: జ్యేష్ట సాయంత్రం గం.6.19 ని.ల వరకు ఆతర్వాత మూల
అమృతఘడియలు: ఉదయం గం.9.27 ని.ల నుంచి గం.11.04 ని.ల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి దాటాక గం.2.10 ని.ల నుంచి గం.3.45 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.8.21 ని.ల నుంచి గం.9.14 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.44 ని.ల నుంచి గం.1.37 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.10.39 ని.ల నుంచి గం. 12.18 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం.5.43 ని.ల కు
సూర్యాస్తమయం :సా. గం. 6.53 ని.లకు
మేషం :
అనుకున్న రీతిలో పనులు సాగవు. ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. చెడుదారులు తొక్కే వీలుంది. శారీరకంగాను, మానసికంగాను అలసిపోతారు. మెరుగైన ఫలితాలకు దుర్గమ్మను పూజించండి.
వృషభం :
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన రోజు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ప్రయోజనాన్నిస్తాయి. విందుల్లో పాల్గొంటారు.
మిథునం :
శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. చిరకాల అభీష్టం నెరవేరుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారంలో బంధువులు తోడుగా నిలుస్తారు.
కర్కాటకం:
కార్యసాధనలో ఆటంకాలుంటాయి. ఇష్టమైన పని చెడిపోవడం మనోవ్యధకు కారణమవుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. వృథా ఖర్చులు ఉంటాయి.
సింహం :
వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. కార్యసాధనలో అవమానాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. బుద్ధి నిలకడగా ఉండదు. వ్యర్థమైన ఖర్చులు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆస్తి విక్రయ యత్నాలు వాయిదా వేయండి.
కన్య :
శ్రీకారం చుట్టిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మెరుగైన ఆదాయం ఉంటుంది. మిత్రుల వల్ల పెద్ద ఉపకారం జరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. సోదరుల తోడ్పాటు ఆత్మధైర్యాన్ని పెంచుతుంది.
తుల :
మీ పనులకు ఇతరుల నుంచి బాగా ఇబ్బందులు ఎదురవుతాయి. సంపాదనకు మించి ఖర్చులుంటాయి. కుటుంబంలోనూ చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతత దూరమవుతుంది. కంటి జబ్బులపై శ్రద్ధ పెట్టండి.
వృశ్చికం :
అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ రంగాల్లోని వారందరికీ మేలిమి ఫలితాల ఉంటాయి. ఇంటికి సౌకర్యాలు అమరుస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు :
చేపట్టిన పనుల్లో నష్టం గోచరిస్తోంది. చెప్పుడు మాటలు పట్టించుకోకండి. మిత్రుల వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువుల గురించిన ఆందోళన పెరుగుతుంది. బాధ్యతలను వదిలిపెట్టాల్సి రావచ్చు.
మకరం :
పనులన్నీ అనుకున్నట్లే సాగుతాయి. అవసరానికి అందరూ సహకరిస్తారు. సంతాన వ్యవహారాల్లోపురోగతి ఉంటుంది. మానసిక శాంతిని పొందుతారు. ఆత్మీయులతో విందులకు హాజరవుతారు. శత్రుపీడ నశిస్తుంది.
కుంభం :
అభీష్టం నెరవేరుతుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. పోటీదారుల కన్నా పైచేయి సాధిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవకాశాలను చేజార్చుకోకండి.
మీనం :
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. పనులూ మందగతిన సాగుతాయి. త్వరగా అలసిపోతారు. శత్రువులపై ఓ కన్నేసి ఉంచండి. దూరపు ప్రయాణాలు గోచరిస్తున్నాయి. కలహాలకు దూరంగా ఉంటే మేలు.