రాశిఫలాలు 20 జూన్ 2024: ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు

Horoscope Today 20 June 2024, దిన ఫలాలు (జూన్ 20, 2024): మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.

Update: 2024-06-19 18:55 GMT

రాశిఫలాలు 20 జూన్ 2024: ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు

దిన ఫలాలు: 20-06-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : త్రయోదశి ఉదయం గం.7.49 ని.ల వరకు తర్వాత చతుర్దశి

నక్షత్రం: అనూరాధ సా.గం. 6.10 ని.ల వరకు తర్వాత జ్యేష్ట

అమృతఘడియలు: ఉదయం గ.7.26 ని.ల నుంచి గం.9.05 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి 11.48 ని.ల నుంచి అర్ధరాత్రి గం.1.25 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.06 ని.ల నుంచి గం.10.59 ని.ల వరకు మళ్లీ సాయంత్రం గం.3.22 ని.ల నుంచి గం. 4.15 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.57 ని.ల నుంచి గం.3.35 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.43 ని.లకు

సూర్యాస్తమయం :సా.గం. 6.53 ని.లకు


మేష రాశి:

మేష రాశి వారికి ఈరోజు మనసుకి కష్టం కలిగించే ఘటనలు ఎదురవుతాయి. ధైర్యాన్ని కోల్పోకండి. తగాదాలకు ఆస్కారం ఉంది. ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. జీర్ణ సమస్యలుంటాయి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి పూజించండి.   


వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈరోజు సుఖప్రదంగా ఉంటుంది.ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. అనుబంధాలు బలపడతాయి. తృప్తికరమైన విందు స్వీకరిస్తారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు శుభదినం. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశంసలొస్తాయి.


మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు భేషుగ్గా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన కార్యాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారంలో బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు.  


కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. నిరాశను వదిలి చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితాలుంటాయి. ఖర్చులు తగ్గించండి. సంతానం వ్యవహారాలపై శ్రద్ధపెట్టండి.   


సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ రోజు ప్రతి పనికీ ఆటంకాలు, జాప్యం చికాకును కలిగిస్తాయి. ధననష్టమూ గోచరిస్తోంది. బంధువిరోధం వల్ల మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగవు. అవమానాలు ఎదురవవచ్చు.


కన్యా రాశి:

కన్యా రాశి వారికి ఈ రోజు కుటుంబ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. చేస్తున్న పనుల్లోనూ శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. కీర్తిప్రతిష్టలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.


తులా రాశి:

తులా రాశి వారికి ఈ రోజుపనులకు విఘ్నాలు ఏర్పడతాయి. తొందరపడి మాట ఇవ్వకండి. బ్యాంకు లావాదేవీల్లో జాప్యం ఉంటుంది. పలుకుబడి తగ్గుతుంది. కుటుంబంలో చికాకులుంటాయి. వృథాఖర్చులు తగ్గించుకోవడం మంచిది.  


వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈరోజు పట్టింది బంగారంలా ఉంటుంది. ధనలాభం ఉంది. అన్ని రంగాల్లోని వారూ ప్రశంసలను పొందుతారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు.  


ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఈరోజు పనులు ఏమాత్రం ఆశాజనకంగా సాగవు. ఇరుగు పొరుగుతో సఖ్యత చెడుతుంది. ఆత్మీయుల అనారోగ్యం ఆందోళన పెడుతుంది. అవసరానికి డబ్బు సమకూరినా వృథాఖర్చులు ఉంటాయి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. 


మకర రాశి:

మకర రాశి వారికి ఈరోజు చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. మీ ప్రయత్నాలకు అందరి నుంచీ సహకారం లభిస్తుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తను వింటారు. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  


కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఈరోజు అభీష్టం నెరవేరుతుంది. అన్నింటా అనుకూలంగానే ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే సూచన ఉంది. ఇంట్లో శాంతి ఉంటుంది. శత్రుపీడ తొలగిపోతుంది. గౌరవం పెరుగుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.


మీన రాశి:

మీన రాశి వారికి ఈ రోజు వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. శత్రువులు మీ బలహీనతపై దెబ్బ కొడతారు. అప్రమత్తంగా ఉండండి. బంధువులతో ముఖ్యంగా సంతానంతోనూ విభేదాలు వస్తాయి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి.

Tags:    

Similar News