Horoscope Today 1st July 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Horoscope Today 1st July 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Update: 2024-07-01 00:30 GMT

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

01-07-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి : దశమి ఉదయం గం.10.26 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి

నక్షత్రం: అశ్వని ఉదయం గం.6.26 ని.ల వరకు ఆ తర్వాత భరణి

అమృతఘడియలు: అర్ధరాత్రి గం.12.51 ని.ల నుంచి గం.2.23 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.3.38 ని.ల నుంచి గం.5.11 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.46 ని.ల నుంచి గం.1.39 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.24 ని.ల నుంచి గం. 9.03 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం 5.46 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.55 ని.లకు


మేషం :

ప్రతి రంగంలోని వారికీ యోగదాయకంగా ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు నెరవేరతాయి. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది.  


వృషభం :

ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాల్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలను వీలైనంత మేర వాయిదా వేయండి. వ్యవహార నష్టం బాధిస్తుంది. బంధువులతో విరోధం ఉంది. అమ్మవారిని పూజించండి.  


మిథునం :

అభీష్టం నెరవేరుతుంది. దీర్ఘకాలిక చిక్కులు తొలగిపోతాయి. శుభకార్యాల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఆత్మీయులు సహకరిస్తారు. శత్రుపీడ తొలగుతుంది. శారీరక, మానసిక శాంతిని పొందుతారు.


కర్కాటకం:

చేపట్టిన కార్యాలు, నిర్వహిస్తోన్న వ్యవహారాలు శుభప్రదంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. వినోదకార్యాల్లో పాల్గొంటారు.  


సింహం :

ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. మీరంటే గిట్టని వారు వదంతులను వ్యాపింపచేస్తారు. ఫలితంగా అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. కడుపులో సమస్యగా ఉంటుంది. శివరాధన మేలు చేస్తుంది.   


కన్య :

కోపాన్ని అదుపు చేసుకోవాలి. ఎవరిపైనా దురభిప్రాయాలు ఏర్పరచుకోకండి. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. జరుగుతున్న ఘటనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. వేంకటేశ్వరుని పూజించండి. 


తుల :

శుభప్రదంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది.  


వృశ్చికం :

ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. శత్రుపీడ, రుణదాతల ఒత్తిళ్లు తగ్గుతాయి. కొత్త వస్తువులు కొంటారు. మిత్రులు సహకరిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.  


ధనుస్సు :

ఆటంకాలు అధికంగా ఉంటాయి. సంతాన వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆవేశాన్ని అదుపు చేసుకోకండి. ఖర్చులు మితిమీరతాయి. అనుమానం పెరుగుతుంది. కీలక వస్తువులు జాగ్రత్త. సుబ్రమణ్యుణ్ణి పూజించండి.  


మకరం :

డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. కార్యాల్లో ఆటంకాలు ఆందోళనకు గురిచేస్తాయి. ఆస్తి విక్రయ ప్రయత్నాలు ముందుకు సాగవు. బుద్ధి నిలకడగా ఉండదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆంజనేయుణ్ణి పూజించండి. 


కుంభం :

సర్వత్రా శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలను సాధించుకుంటారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. మిత్రులు తోడుంటారు.  


మీనం :

తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకండి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పనులు జరగక పోవడం నిరాశను కలిగిస్తుంది. కుటుంబంలోనూ చికాకులుంటాయి. సాంత్వనకు దత్తాత్రేయుణ్ణి పూజించండి.

Tags:    

Similar News