Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
18-07-2024 (గురువారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం
తిధి : ద్వాదశి రాత్రి గం.8.44 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి
నక్షత్రం: జ్యేష్ట ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.3.25 ని.ల వరకు ఆ తర్వాత మూల
అమృతఘడియలు: సాయంత్రం గం.6.33 ని.ల నుంచి రాత్రి గం.8.09 ని.ల వరకు
వర్జ్యం: ఉదయం గం.8.52 ని.ల నుంచి గం.10.28 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.10.12 ని.ల నుంచి గం.11.04 ని.ల వరకు తిరిగి మధ్యాహ్నం గం.3.25 ని.ల నుంచి గం.4.17 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.2.00 ని.ల నుంచి గం.3.38 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం.5.51 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం.6.54 ని.లకు
మేషం :
ప్రతికూల ఫలితాలుంటాయి. అనుకున్నట్లుగా సౌకర్యాలు సమకూరవు. ఇతరులపై అపోహలు పెరుగుతాయి. చెడు ఆలోచనలు రానీయకండి. తగాదాలకు ఆస్కారముంది. జీర్ణ, కీళ్ల సంబంధ సమస్య ఉంటుంది.
వృషభం :
ప్రయత్నాలు అనుకూలిస్తాయి. డబ్బుకి ఇబ్బందేమీ ఉండదు. సౌఖ్యాలను అనుభవిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. కీర్తి పెరుగుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు.
మిథునం :
గొడవలు సద్దుమణుగుతాయి. కార్యాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యులతో సంభాషణలు ఉల్లాసాన్నిస్తాయి. కార్యదక్షతకు ప్రశంసలు లభిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
కార్య నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో ఆటంకాలు మనోవ్యధను కలిగిస్తాయి. ఆలోచనలు వక్రగతిన సాగుతాయి. శత్రుత్వాలు పెరుగుతాయి. వృథా ఖర్చులు తగ్గించాలి. విలువైన వస్తువులు జాగ్రత్త.
సింహం :
మనసు నిలకడగా ఉండదు. హడావుడి నిర్ణయాలు అమలు చేయకండి. కీలక సందర్భాల్లో ఆత్మీయులను సంప్రదించండి. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. నోటి దురుసుతనం కారణంగా అవమానపడతారు.
కన్య :
చేపట్టిన ప్రతి కార్యం సఫలమవుతుంది. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. వృత్తిజీవితంలో విశేష లాభం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సోదరుల తోడ్పాటు లభిస్తుంది. ఆత్మీయులు ఉల్లాస పరుస్తారు.
తుల :
తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. డబ్బు బాగా ఖర్చవుతుంది. పైగా నిందలు ఎదురవుతాయి. పరిణామాలు మనసుకి కష్టం కలిగిస్తాయి. నిలుపుకోలేని హామీ ఇవ్వకండి. విరోధాలకు దూరంగా ఉండండి.
వృశ్చికం :
పనులు సఫలమవుతాయి. నూతన ప్రణాళికలను అమలు చేస్తారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.
ధనుస్సు :
పనులు సజావుగా సాగవు. కార్యవైఫల్యం వేదనకు గురి చేస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. ప్రయాణాలు వాయిదా వేయండి. వేళకు భోజనం అందదు.
మకరం :
అభీష్టం నెరవేరుతుంది. ఆనందంగా గడుపుతారు. మిత్రుల కారణంగా లాభపడతారు. ఇతరుల నుంచీ సహకారం అందుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం :
అభీష్టాలను నెరవేర్చుకుంటారు. అధికారుల మన్ననలు పొందుతారు. స్థిరనిర్ణయాలు గుర్తింపును తెస్తాయి. అవకాశాన్ని వాడుకోండి. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచన ఉంది. మనశ్శాంతిని పొందుతారు.
మీనం :
పనుల పూర్తికి శ్రమించాల్సి ఉంటుంది. బద్ధకం పనికిరాదు. పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలు చికాకు పెడతాయి. బాధ్యతల నుంచి వైదొలగాల్సి రావచ్చు. త్వరగా అలసిపోతారు. అశాంతితో ఉంటారు. ఖర్చులు తగ్గించండి.